సైరాను వీక్షించిన తెలంగాణ గవర్నర్.. చిరంజీవి సాదర ఆహ్వానంతో..!
తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథా నేపథ్యంగా తెరకెక్కిన సైరా చిత్రం విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రాన్ని బుధవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకు తన కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. చిత్ర ప్రదర్శన తర్వాత చిరంజీవి నటనపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించినట్టు సమాచారం.
సైరా ప్రత్యేక ప్రదర్శనకు వచ్చిన గవర్నర్‌ను చిరంజీవి, యూనిట్ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన గవర్నర్‌కు ఈ సందర్బంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ తమిళిసాయిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌కు వెళ్లి చిరంజీవి భేటీ అయ్యారు. అంతేకాకుండా దసరా పండుగ శుభాంకాంక్షలు తెలియజేశారు. గవర్నర్‌తో భేటీ దాదాపు గంటకుపైగానే ఆ రోజన జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా చిరంజీవికి తేనేటి విందును ఇచ్చినట్టు తెలిసింది.

గవర్నర్ తమిళిసాయితో భేటి సందర్భంగా సైరా సినిమా ప్రస్తావన రాగా.. చిరంజీవిని అప్పట్లో అభినందించిన తెలిసిందే. ఈ సందర్భంగా సైరా చిత్రాన్ని వీక్షించాలని చిరంజీవి కోరగా అందుకు సమ్మతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్‌కు ప్రత్యేక షోను ఏర్పాటు చేశారు. ఇక సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. గత ఏడు రోజుల్లో రూ.200 కోట్లకుపైనే గ్రాస్ వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











