కమల్ హాసన్‌కు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన ఇండియన్ 2 టికెట్ రేట్స్

గతంలో కంటే ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో సీక్వెల్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ కొన్నేళ్ల క్రితం వచ్చి సక్సెస్ సాధించిన చిత్రాలకు కొనసాగింపుగా ప్రాజెక్టులు రూపొందుతోన్నాయి. అలా 1996లో కమల్ హాసన్ హీరోగా వచ్చి సంచలనం అయిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్‌గా 'ఇండియన్ 2' మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.

విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ రూపొందించిన చిత్రమే 'భారతీయుడు'. దీనికి ఇప్పుడు సీక్వెల్‌గా 'ఇండియన్ 2' సినిమాను తెరకెక్కించారు. యూనివర్శల్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను హై రేంజ్‌లో రూపొందించారు.

Telangana Govt Granted Permission to Hike Kamal Haasan Starrer Indian 2 Movie Ticket Rates

సందేశాత్మక కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఇండియన్ 2' మూవీని జూలై 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా ఇండియా వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే.

టాలీవుడ్ నుంచి వచ్చే భారీ చిత్రాలకు స్పెషల్ షోలు, టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసలుబాటు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కమల్ హాసన్ హీరోగా నటించిన 'ఇండియన్ 2' సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా జూలై 12వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఐదు షోలు వేసుకునేందుకు పర్మీషన్ ఇచ్చేసింది.

Telangana Govt Granted Permission to Hike Kamal Haasan Starrer Indian 2 Movie Ticket Rates

అంతేకాదు, ఇప్పుడు తెలంగాణలో అమలులో ఉన్న టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్స్‌లో 50, మ‌ల్టీప్లెక్స్‌లో 75 వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటును రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది. దీంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్లలో 'ఇండియన్ 2' టికెట్ రేట్లు రూ. 215, మ‌ల్టీప్లెక్స్‌లో రూ 413 అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్, బయ్యర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఇండియన్ 2' సినిమాపై లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ బ్యానర్లపై శుభకరణ్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. ఇందులో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్యలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Read more about: indian 2 kamal haasan s shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X