Pawan Kalyan : తెలంగాణ ప్రభుత్వం నోటీసులు.. చిక్కుల్లో పవన్ కళ్యాణ్ ప్రాణ మిత్రుడు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొందరు సినీ ప్రముఖులకు ప్రభుత్వం నుంచి నోటీసులు వస్తుండటంతో పాటు కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిలపై పలు కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల అంతు చూస్తున్న హైడ్రా కూడా పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు నోటీసులు ఇచ్చింది. తాజాగా మరో సీనియర్ నటుడు చిక్కుల్లో పడ్డాడు వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో ఉన్న టాప్ కమెడియన్లలో అలీ ఒకరు. నాలుగున్నర దశాబ్ధాలుగా ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్, హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తున్నారు అలీ. ఆయన పేరు చెప్పగానే చిత్ర విచిత్ర భాష, వింత శబ్ధాలు, వెరైటీ గెటప్స్, మేనరిజమ్స్ కళ్ల ముందు మెదులుతాయి. హాస్య బ్రహ్మ జంధ్యాల చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన అలీ .. తర్వాతి కాలంలో ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకుల చేతిలో పడి స్టార్ కమెడియన్‌గా మారాడు. ఇక పూరీ జగన్నాథ్ ఎంట్రీతో అలీ గెటప్స్ పూర్తిగా మారాయి. అలీని లక్కీ హ్యాండ్‌గా భావించే పూరి.. తన సినిమాలలో ఖచ్చితంగా ఓ వెరైటీ క్యారెక్టర్ రాస్తారు.

telangana govt officials send notice to Tollywood comedian ali

ఎంతో మంది కొత్త కమెడియన్లు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా.. టాలీవుడ్‌లో అలీకి మాత్రం క్రేజ్ తగ్గలేదు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన కమెడియన్లు ఫేడ్ అవుట్ అయిపోయినా అలీ మాత్రం ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నారు. కాలానికి , ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా తనను తాను మార్చుకోవడమో ఇందుకు కారణం. ఓ వైపు సినిమాలు చేస్తూనే బుల్లితెరపై హోస్ట్‌గానూ బిజీగా ఉన్నారు. రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తితో ఉండే అలీ .. తెలుగుదేశం పార్టీకి దశాబ్థాలుగా సేవలందించారు.

అయితే ఏమైందో ఏమో కానీ 2019 ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి అనూహ్యంగా వైసీపీలో చేరారు అలీ. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన సేవలను గుర్తించిన జగన్.. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పోస్ట్ కట్టబెట్టారు. ఇండస్ట్రీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటారు అలీ. పవన్ నటించే సినిమాలో అలీ తప్పకుండా ఉంటారు. అలాంటి ప్రాణ స్నేహితుడు జనసేన పార్టీని పెట్టి వైసీపీపై పోరాడుతూ ఉంటే అలీ ఏకంగా జగన్‌కు జైకొట్టడం కలకలం రేపింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో అలీ రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు.

ఏళ్లుగా చిత్ర సీమలో స్టార్ కమెడియన్‌గా కొనసాగుతున్న అలీ బాగానే వెనకేశారు. తన సంపాదనను రియల్ ఎస్టేట్‌లోనూ, పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో అలీకి నోటీసులు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. అసలేం జరిగిందంటే.. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని తన ఫాంహౌస్‌లో అలీ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనికి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలంటూ గతంలోనే అలీకి పంచాయతీ అధికారులు నోటీసులు పంపారు. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో మరోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు పంపారు. దీనిపై స్పందించని పక్షంలో అలీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X