Allu Arjun : తను సేఫ్ .. రామ్ చరణ్‌ని అడ్డంగా ఇరికించేసిన అల్లు అర్జున్
దేశవ్యాప్తంగా ఉన్న సినీ నటీనటులకు మోస్ట్ ఫెవరెట్ ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు సినిమా ఇండస్ట్రీయే అనే చెబుతారు. మన తెలుగు ఆడియెన్స్ ఇచ్చే ఆదరణ ఇంకెక్కడా దొరకదని పలువురు ఇతర భాషల నటీనటులు ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మన స్టార్స్ కి చేసే వేడుకలు, సంబరాలు.. ఇతర డబ్బింగ్ సినిమాల రీరిలీజ్ లకి కూడా చేసే హంగామా అంతా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే వినిపిస్తూ ఉంటుంది.
ఇలా సినిమా పరంగా మన తెలుగు ఆడియెన్స్ చాలా ప్రొఫెషనల్ గానే ఉంటారు. ఏపీ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ అనే సంప్రదాయం ఎప్పుడు నుంచో ఉన్నదో మన అందరికీ తెలుసు. సినిమా రిలీజ్‌కు ముందే అర్ధ రాత్రి నుంచే ఎన్నో సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడేవి. కానీ ఆ మధ్యలో ఏపీలో వీటిని ఆపేసారు . కానీ మళ్ళీ ఇపుడు పరిస్థితి అంతా నార్మల్ అయ్యింది.

ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా వచ్చిన చిత్రం పుష్ప పార్ట్ 2 భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. దీనికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ ధరల పెంపుతో పాటుగా స్పెషల్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ కి కూడా ఇచ్చిన అనుమతులు అని చెప్పొచ్చు. మరి ఈ అనుమతులతో ప్రజల ప్రాణాలు కోల్పోయేవరకు పరిస్థితులు వచ్చేసాయి.
తెలంగాణాలో సంధ్య 70 ఎంఎంలో పుష్ప 2 స్పెషల్ షోకి గాను అల్లు అర్జున్ రావడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. జనం తాకిడి ఒక్కసారిగా ఎక్కువ కావడంతో జరిగిన తొక్కిసలాటలో రెండు నిండు ప్రాణాలు పోయాయి. అందులో చిన్న బాలుడు కూడా ఉండడం విషాదకరం. దీనితో తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇక నుంచి ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోస్ కి అనుమతులు ఇచ్చేది లేదు అని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుకుం జారీ చేసారు. అంతేకాదు రానున్న సంక్రాంతి సీజన్ నుంచే అమలులో ఉంటుంది అని, అలాగే టికెట్ ధరలు కూడా నియంత్రిస్తాం అని షాకింగ్ నిర్ణయంతో కోమటిరెడ్డి కన్ఫర్మ్ చేశారు. దీనితో పుష్ప 2 తర్వాత వచ్చిన ఈ నిర్ణయం హర్షణీయమే కానీ అక్కడ వసూళ్లు బిజినస్ పరంగా పుష్ప 2 బాగా సేఫ్ అయ్యిపోయింది. కానీ నెక్స్ట్ వచ్చే బిగ్ సినిమా రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" బుక్కయ్యిపోయింది అని చెప్పాలి.

పుష్ప 2కు కూడా అనుమతులు రావడంతో గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు అదే రేట్స్ అండ్ షోస్ రెండూ తెలుగు రాష్ట్రాల్లో తెచ్చుకునే ప్లానింగ్స్ లో ఉన్నారని టాక్ వచ్చింది. రేట్లు కాకపోయినా బెనిఫిట్ షోస్ తో కూడా పలు భారీ వసూళ్లు వచ్చే ఛాన్స్ అక్కడే ఉంది. ఇపుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో మాత్రం ఒకింత ఎఫెక్ట్ అయ్యేది "గేమ్ ఛేంజర్" అనే చెప్పొచ్చు. ఇప్పటికే "గేమ్ ఛేంజర్" నైజాంలో భారీ బిజినెస్ చేసింది అని టాక్ ఉంది. మరి ఆ మొత్తాన్ని రాబట్టాలి అంటే యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











