Vyooham: వ్యూహం సినిమాకు మరో షాక్.. ఆ రిపోర్టు వచ్చే వరకూ ఆగాల్సిందేనట!

కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసింయే అయితే ఆయన తాజాగా తెరకెక్కించిన మరో వివాదాస్పద సినిమా వ్యూహం. ఏపీ రాజకీయల గురించి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా విషయంలో మరొకసారి మూవీ టీంకు షాక్ తగిలింది. ఆ రిపోర్టులు వచ్చే వరకు సినిమా విడుదల చేయకూడదని.. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందుగానే ఆ రిపోర్టులు తీసుకు రావాలని ఆదేశించింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు శివ వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య మొత్తం వివాదాస్పదన సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడూ హాట్ టాపిక్ అయ్యే విధంగా ఉండే చిత్రాలతో వస్తూ అనేక ప్రభంజనాలు సృష్టిస్తున్నారు. రాజకీయ నాయకులతో పాటు సినిమా సెలబ్రిటీల లైఫ్ స్టోరీలను ఆధారంగా చేసుకుని పలు సినిమాలు తీస్తున్నారు. అయితే తాజాగా ఏపీ రాజకీయలకు చెందిన ఓ అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు.

Telangana High Court Another Shock to Ram Gopal Varma Vyooham Movie Check Details

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత.. రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారాయి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఏం చేశారనే కథతో వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా పాదయాత్ర మొదలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో టీడీపీని కించపరిచే విధంగా చూపించి ఉంటారని ఉద్దేశంతో నారా లోకేష్ సహా తెలుగుదేశం పార్టీ నేతలు ముందు నుంచి ఈ సినిమాకి ఏదో ఒక విధంగా అడ్డుపడుతూనే ఉన్నారు.

ఇటీవలే హైకోర్టు సింగ్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై స్పందించిన తెలంగాణ హైకోర్టు ఈనెల 9వ తేదీలోగా సెన్సార్ బోర్డు రిపోర్ట్ ఇవ్వాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్ బెంచ్ తీర్పుకు అనుగుణంగా సినిమాను మరోసారి రీవ్యూ చేసి ఈనెల 9వ తేదీ లోపు రిపోర్ట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది.

Telangana High Court Another Shock to Ram Gopal Varma Vyooham Movie Check Details

ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించారు. అలాగే రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించగా... అజ్మల్ అమీర్, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X