వ్యూహం రిలీజ్ నిరవధిక వాయిదా.. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు.. రాంగోపాల్ వర్మకు హైకోర్టు షాక్!
వ్యూహం సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు, నిర్మాత దాసరి కిరణ్‌కు హైకోర్టు షాకిచ్చింది. ఈ సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలని చేసిన ప్రయత్నాలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఈ సినిమాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్‌ను జస్టిస్ సూరపల్లి నంద నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేయడంతో ఈ సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడింది. హైకోర్టు విచారణ, ఆదేశాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజకీయ ప్రత్యర్థులకు అనుకూలంగా, తరఫున వకాల్తా పుచ్చుకొని దర్శక, నిర్మాతలు రూపొందించారు. మా నాయకుడి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కుట్ర పన్నారు. కాబట్టి సినిమా రిలీజ్‌ను ఆపివేయాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలను విచారణను న్యాయమూర్తి విన్నారు. గురువారం అంటే డిసెంబర్ 28వ తేదీన సుదీర్గంగా జరిగిన విచారణ సందర్భంగా సెన్సార్ బోర్డు తరఫున అధికారుల వాదన కూడా సావధానంగా విన్నారు.

సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది. కాబట్టి సృజనాత్మక భావనపై అణిచి వేయవద్దు అని వ్యూహం సినిమా దర్శక, నిర్మాతల తరఫున న్యాయవాది బలంగా వాదనలు వినిపించారు. అయితే ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేసిన అధికారుల నుంచి వివరణ కోరింది.
దాంతో లోకేష్ పిటిషన్‌పై వాదన సందర్భంగా సెన్సార్ బోర్డు అధికారులు తమ వాదనను వినిపిస్తూ.. తొలుత ఈ సినిమాకు ఎగ్జామినింగ్ కమిటి సర్టిఫికెట్‌ను నిరాకరించింది. అయితే మూవీలోని కొన్ని సన్నివేశాలను తొలగించిన తర్వాత సెన్సార్ బోర్డుకు సంబంధించిన రివైజింగ్ కమిటీ విడుదలకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమాలోని పాత్రలు, వాటి పేర్లు కల్పితాలు అనే డిస్‌క్లైమర్‌ను మార్చాలని, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించామని డిస్‌క్లైమర్‌లో వెల్లడించాలి. భావ ప్రకటన స్వేచ్ఛతో వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించకూడదు అని దర్శకుడు రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ తరఫున ఈ కేసును ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు.
లోకేష్ దాఖలు చేసిన ఫిటిషన్‌ను విచారించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను జనవరి 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తమ ఆదేశాల్లో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











