పవన్ కళ్యాణ్ OGకి తెలంగాణ హైకోర్టు షాక్.. ధరల పెంపు నిలిపివేత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ THEY CALL HIM OG వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా జోరుగా టికెట్స్ అమ్ముడు పోతున్నాయి. అడ్వాన్స్ బుక్కింగ్స్ లో OG చిత్రం దుమ్ములేపుతోంది. తెలుగు స్టేట్స్, ఇతర రాష్ట్రాలతో కలిసి ఇండియాలో, మరోవైపు ఓవర్సీస్ లోనూ అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 2.5 మిలియన్ టికెట్లు అమ్ముడు పోవడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటు ఇండియాలోనూ మొదటి రోజు రూ.55 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వసూళ్లు అందుకుంది.

సెప్టెంబర్ 25న OG చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుండటంతో ఇంకా బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి అన్ని ఏరియాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షోకు సంబంధించి హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టేసినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇలా OG చిత్రం టికెట్స్ బుకింగ్స్ లో జోరు కొనసాగిస్తుంటే తెలంగాణ హైకోర్టు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. OG చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్ల పెంపుపై కీలక ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.

Telangana High Court Shock to Pawan Kalyan OG Movie Here is details

సినీ ప్రముఖులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. రెండ్రోజుల కింద తెలంగాణ ప్రభుత్వం OG చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునే వెలుసు బాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ మేరకు బెనెఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. కాగా బెనెఫిట్ షోలకు రూ.800 ఒక్క టికెట్ కు గానూ, ఇక మల్టీప్లెక్స్ లో ఒక్క టికెట్ పై రూ.150, సింగిల్ స్క్రీన్ టికెట్ ధరపై రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోంబర్ 4 వరకు 10 రోజుల పాటు ఈ సదవకాశాన్ని అందించింది.

కానీ OG చిత్రం రిలీజ్ కు ఒక్క రోజు ముందు షాకింగ్ న్యూస్ అందింది. ఓజీ చిత్రం టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్సెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో OG టికెట్ రెట్లు సాధారణంగానే కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు బుక్కింగ్ అయిన టికెట్లపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది చూడాలి. దీనిపై మున్ముందు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి, టికెట్ కొనుగులు చేసిన ఆడియెన్స్ కు ఎలా రిఫండ్ అందుతుందనేది వేచి చూడాలి.

ఇక ఈ చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ప్రియాంక మోహనన్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించడం విశేషం. తమిళ స్టార్స్ అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.

More from Filmibeat

Read more about: pawan kalyan og movie sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X