పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలో విలన్ రోల్.. ఆ స్టార్ డైరెక్టర్ గంట బ్రతిమాలాడు: మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ఇటీవల కాలంలో ఏం మాట్లాడినా కూడా మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు మల్లారెడ్డికి డైలాగ్స్ తో అనేక రకాల మీమ్స్ వస్తుంటాయి. అయితే వాటిని మల్లారెడ్డి కూడా సరదాగా తీసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న మల్లారెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ఆ చిత్ర దర్శకుడు గంట బ్రతిమాలినా ఒప్పుకోలేదని అన్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

డైలాగ్స్ తో వైరల్
మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలకు సంబంధించిన అంశాలతో కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆ మధ్య మల్లారెడ్డి అంటే.. అనే డైలాగ్స్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే పాలు అమ్మినా అనే డైలాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. తాను చాలా ఫేమస్ అని అందుకే అందరూ తన డైలాగ్స్ వాడుకుంటారు అని చాలా సింపుల్ గా రియాక్ట్ అవుతుంటారు.

ఆ సినిమా ఈవెంట్ లో..
ఇక మంత్రి మల్లారెడ్డి ఇటీవల ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా చాయ్ బిస్కెట్ వారి ప్రొడక్షన్ లో వస్తున్న మేమ్ ఫేమస్ అనే సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన మాటలతో ఒక విధంగా మీమర్స్ కు కూడా మంచి స్టఫ్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది.

పాలు అమ్మినా..
తెలంగాణ నుంచి మళ్ళీ మరో మంచి కుర్రాడు హీరోగా వస్తున్నాడు అని ఈ రకంగా తెలంగాణ యువత కూడా ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. నేను పాలు అమ్మినా.. పూలు అమ్మినా అనే డైలాగ్స్ తో మరోసారి ఆకట్టుకున్న మల్లారెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ యువతకు అవకాశాలు రాలేదు అని కానీ ఇప్పుడు ఏకంగా మన బాషతోనే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు.

పవన్ సినిమాలో ఆఫర్
అయితే తాను కూడా ఊరికే ఫేమస్ అవ్వలేదని అంటూ చాలా కష్టపడ్డాను అని అన్నారు. ఇక ఇటీవల సినిమాల్లో తనకు కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి అని అన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాత్ర కోసం దర్శకుడు దాదాపు గంటపాటు బ్రతిమాలాడు అన్ని అయితే అలాంటి పాత్ర తాను చేయకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు.

ఆ దర్శకుడు ఎవరంటే..
ఆ దర్శకుడు మరెవరో కాదు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ అని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. అతను పవన్ కళ్యాణ్ తో చేయబోయే తదుపరి సినిమాలో విలన్ పాత్ర కోసం అడిగాడు. కానీ అలాంటి విలన్ పాత్ర నేను చేయను అని చెప్పాను. గంటసేపు బ్రతిమాలాడు. అయినా కూడా ఒప్పుకోలేదని అన్నారు. ఇక ఎలక్షన్స్ తరువాత నేను నాలుగైదు సినిమాలు చేస్తానని ప్రస్తుతం ప్రజా సేవలో బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ సినిమా కోసం
ఇక మల్లారెడ్డి చెప్పినదాన్ని బట్టి హరీష్ శంకర్ తేరి రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక విలన్ పాత్ర కోసం అడిగి ఉంటారని అర్ధమవుతోంది. ఇక ఆ సినిమా షూట్ ఈపాటికే స్టార్ట్ కావాల్సింది. కానీ పవన్ వినోదయ సీతమ్ రీమేక్ లో బిజీగా ఉండడం వలన ఆలస్యంగా మొదలవుతోంది. ఏప్రిల్ లో ఫస్ట్ వీక్ లోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











