చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్

యువ హీరో శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం శ్రీకారం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా న‌టిస్తోన్న‌ ఈ చిత్రంలోని ఇప్ప‌టికే విడుద‌లైన‌ పాటలకు, ట్రైలర్స్ కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది..హై ఎక్స్ పెక్టేషన్స్ తో మహాశివరాత్రి సందర్బంగా మార్చి11న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

ఈ సంద‌ర్భంగా ఖమ్మంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ‌కారం బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు కిషోర్ బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట. రైటర్ సాయి మాధవ్ బుర్రా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదిత‌రులు పాల్గొన్నారు. తమ ఆతిథ్యం స్వీకరించినందుకు గానూ మమత ఎడ్యుకేషనల్ సొసైటి తరుపున చిరంజీవికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిరు సత్కారం చేశారు.

 Telangana Minister Puvvada Ajay Kumar crazy speech at Sreekaram Pre Release Event

అనంతరం తెలంగాణ మంత్రి పువ్వాడ‌ అజ‌య్ కుమార్ మాట్లాడుతూ - పెద్దలు, మనందరికి అన్నయ్య ఆచార్య మెగాస్టార్ చిరంజీవి గారు.. ముఖ్య అతిథిగా ఉన్న శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాల్గొన్న వర్దమాన నటుడు శర్వానంద్, అరుళ్ మోహన్, దర్శక నిర్మాతలు, చిత్రయూనిట్‌కు నమస్సుంజాలి తెలియజేస్తున్నాను..

 Telangana Minister Puvvada Ajay Kumar crazy speech at Sreekaram Pre Release Event

శ్రీకారం ఈవెంట్‌కు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం చిరంజీవి. మీరు ఖమ్మంలో ఒక్క షెడ్యూల్‌ అయినా చేయాలని కోరాను. ఆ కోరిక మేరకు కొరటాల శివ గారితో చెప్పించారు. కంటికి రెప్పలా చూసుకో అని కేటీయార్ గారు ఆదేశం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి నేను మీ అభిమానిని. మార్నింగ్ షోకే వెళ్లి బ్రహ్మాండంగా డ్యాన్సులు, స్టెప్పులు వేసిన వాళ్లలో మేం ఉన్నాం. బావగారూ బాగున్నారా సినిమా డిస్ట్రీబ్యూషన్ కూడా చేశాం.. మీరు కేంద్రమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పని చేశారు.. సినీ పరిశ్రమకు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు.. బ్లడ్ అండ్ ఐ బ్యాంకుల ద్వారా ఎంతో మందికి సాయమందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి స్ఫూర్తిదాయకం. ఆచార్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X