Ganja Shankar: మెగా హీరో సినిమాకు తెలంగాణ పోలీసుల షాక్.. అదే కొంపముంచిందిగా!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందిరనీ మెప్పించే ఈయన తాజాగా ఓ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ దానికి ఆదిలోనే అనేక సమస్యలు వచ్చి పడ్డాయి. ముఖ్యంగా టైటిల్ ప్రకటనతో ఈ కుర్రాడి చిత్రానికి పోలీసుల నుంచి నోటీసులు వచ్చేశాయి. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నారు. అయితే పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. అయితే భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఎ.ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి గాంజా శంకర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు చిత్రబృందం. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పేరు మార్చాలంటూ చిత్ర యూనిట్‌కి నోటీసులు జారీ చేశారు. ఈ సినిమా ట్రైలర్ యూత్‌పై ప్రభావం చూపుతుందని, అందుకే మార్చాలని సూచించినట్లు సమాచారం. సినిమా ఆర్టిస్టులు, చిత్ర బృందం.. సామాజిక బాధ్యతగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏమైనా అబ్యంతరక సన్నివేషాలు ఉంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు సమాచారం. ఆదిలోనే సాయి ధరమ్ తేజ్ సినిమాకు సమస్యలు ఎదురవడంతో అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు. మరి ముందు ముందు ఏం జరగనుంది... గాంజా తీసేసి కేవలం శంకర్ అనే సినిమా పేరును పెడతారా లేక ఇంకేదైనా కొత్త టైటిల్ ను ఫిక్స్ చేస్తారా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాలసిందే.


Click it and Unblock the Notifications











