మంగ్లీ పార్టీలో మరో ట్విస్టు.. బర్త్ డే వేడుకల్లో రాజకీయ నేతలు.. ప్రముఖ కమెడియన్ ఖండన

తెలుగు సినిమా పరిశ్రమలో నిషేధిత మాదక ద్రవ్యాలు, విదేశీ మద్యంతో తన బర్త్ డే వేడుకలను జరుపుకొంటూ నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ అధికారులకు సింగర్ మంగ్లీ పట్టుబడటం తెలుగు సినిమా పరిశ్రమలో కలకలం రేపింది. ఆ పార్టీలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు తమ స్పందనను వెల్లడిస్తున్నారు. మరికొందరు తమపై వస్తున్న అవాస్తవాలను ఖండిస్తున్నారు. ఇక పార్టీలో పాల్గొన్న వారి ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పార్టీలో ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఓ కమెడియన్ తనకు సంబంధం లేదంటూ ప్రకటన జారీ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌ నగర శివారులోని చేవెళ్లలోని ఓ ప్రైవేట్ రిసార్టులో సింగర్ మంగ్లీ తన జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. ఈ వేడుకలో తనకు సన్నిహితులు, స్నేహితులైన వారిని ఆహ్వానించారు. ఈ పార్టీలో తెలుగు సినిమా రంగానికి చెందిన యువ తార దివి వద్యా, యువ పాటల రచయిత కాసర్ల శ్యామ్, యువ సింగర్ ధనుంజయ్, నిర్మాత ధనుంజయ్ హాజరయ్యారు.

Singer Mangli Birthday

ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ట్విస్టు ఏమిటంటే.. ఈ పార్టీలో రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు అని కొందరు వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ పార్టీకి హాజరైన వారిలో బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కవితకు చెందిన తెలంగాణ జాగృతికి చెందిన రాజీవ్, తదితర నేతలు ఉన్నారు అని కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే వారు మాత్రం ఎలాంటి స్పందన వెల్లడించకపోవడంతో ఆ వీడియోలో ఉన్నవారు వారేనా? కాదా? అనే సంశయం ఏర్పడింది.

ఇదిలా ఉండగా, కమెడియన్ రచ్చ రవి తన పేరు చేర్చడంపై అభ్యంతరం చెప్పాడు. తాను సింగర్ మంగ్లీ పార్టీకి హాజరుకాలేదు. కానీ నేను ఆ పార్టీలో ఉన్నట్టు కొన్ని వార్తలు నా వద్దకు వచ్చాయి. దాంతో నేను ఆ పార్టీకి హాజరు కాలేదని చెప్పాలని ఈ ప్రకటన రిలీజ్ చేశాను. నేను సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాను.నా ఫ్యామిలీని కలుసుకోలేని పరిస్థితి. అలాంటి బిజీ నేపథ్యంలో ఈ పార్టీకి దూరంగా ఉన్నాను. ఈ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని రచ్చరవి అన్నారు.

అయితే సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకల్లో నేను ఉన్నట్టు వస్తున్న వార్తలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. కొన్ని ఛానెల్స్, కొన్ని మీడియా సంస్థలు నా పేరు ప్రస్తావిస్తున్నాయి. కాబట్టి మీడియా వారికి సవినయంగా నేను చేసుకొనే విన్నపం ఏమిటంటే.. ఆ పార్టీకి సంబంధించిన రిపోర్టుల్లో నా పేరును దయచేసి చేర్చవద్దు. సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకల్లో నేను పాల్గొనలేదని మరోసారి వెల్లడిస్తున్నాను అని రచ్చ రవి చెప్పారు.

ఇదిలా ఉండగా, మంగ్లీ బర్త్ వేడుకలను అనుమతి లేకుండా నిర్వహించారు. చట్ట విరుద్దంగా విదేశీ మద్యం, గంజాయి ఉపయోగించినట్టు మా దృష్టికి వచ్చింది. తొమ్మిది మందికి పాజిటివ్‌గా తేలింది. అనుమతి లేకుండా పార్టీని ఏర్పాటు చేసినందుకు గాను మంగ్లీపై.. అలాగే పార్టీని నిర్వహించినందుకు గాను..రిసార్ట్ మేనేజర్‌పై కేసు నమోదు చేశామని చేవెళ్ల పోలీసులు తెలిపారు.

More from Filmibeat

Read more about: singer mangli rachcha ravi brs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X