గబ్బర్ సింగ్ సినిమాలో ఆ హిట్ సాంగ్ పాడిన సింగర్ మృతి.. ఎవరు, ఎలా చనిపోయారంటే?

ఇటీవల కాలంలో సినీ రంగంలో వరుసగా విషాధాలు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని సినీ రంగాల్లో అనేక మంది సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితమే బాలీవుడ్ కు చెందిన ఓ టాప్ డైరెక్టర్ కుమార్ సహానీ, ఆ తర్వాతి రోజే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ వీ మహేష్, ఆ మరుసటి రోజు పద్మశ్రీ అవార్డు గ్రహిత లెజెండరీ గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. ఈ వార్తలు అన్నీ మరువక ముందే మరో టాలీవుడ్ స్టార్ సింగర్ నేలకొరిగారు. అయితే ఈ సింగర్ పేరేంటి ఆయన వివరాలు ఏంటి, ఎలా చనిపోయారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ టాప్ ఫోక్ సింగర్ గా పేరు తెచ్చుకున్న వడ్డెపల్లి సుధాకర్ గురించి అందరికీ బాగానే తెలిసి ఉంటుంది. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈయన తాజాగా ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లోని తన నివాసంలో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వడ్డెపల్లి సుధాకర్ మృతి వార్త తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఎన్నెన్నో అద్భుతమైన పాటలు అందించిన ఆయన ఈలోకాన్ని వీడి వెళ్లడం చాలా కష్టంగా ఉందంటూ సోషల్ మీడియా వేధికగా ప్రకటిస్తున్నారు.

Telangana Top Folk Singer Vaddeppalli Srinivas Passed Away Check Details

వడ్డెపల్లి సుధాకర్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా గబ్బర్ సింగ్ లో ఓ పాట పాడారు. గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా.. అంటూ సాగే ఆ పాట పాడి విపరీతమైన గుర్తింపు దక్కించుకున్నారు. ఈ పాటకు గాను వడ్డెపల్లి సుధాకర్ కు ఫిలింఫేర్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అవార్డు కూడా వచ్చింది. ఈ ఒక్క పాట మాత్రమే కాదండోయ్.. కింగ్ సినిమాలో ఎంత పని చేస్తివిరో ఎములాడ రాజన్న పాటను కూడా ఈయనే పాడారు. ఇలా ఎన్నెన్నో అద్భుతమైన పాటలు పాడి కుర్రకారును ఉర్రూతలూగించారు.

Telangana Top Folk Singer Vaddeppalli Srinivas Passed Away Check Details

ఇవి మాత్రమే కాకుండా బయట కూడా చాలానే పాటలు పాడారు. 100కు పైగా పాటలు, ప్రైవేట్ గా లెక్కలేనన్న ఫోక్ సాంగ్స్ పాడి తెగ అలరించారు. ఇలా తన టాలెంట్ తో ఎంతో మందికి దగ్గర అయిన తాజాగా ప్రాణాలు కోల్పోవడంతో అంతా షాక్ అవుతున్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూనే ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ప్రార్ఖిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X