హీరోగా మారిన టెలివిజన్ నటుడు.. నరసింహపురం యూనిట్‌కు ప్రకాశ్ రాజ్ ప్రశంస
బుల్లితెరపై మంచి గుర్తింపు పొంది వెండితెర మీద రాణించిన నటులు చాలా మందే ఉన్నారు. తాజాగా టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి మరో నటుడు టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. టెలివిజన్‌లో తనదైన శైలి రాణించిన నందకిశోర్ ప్రస్తుతం నరసింహపురం సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్స్ లో విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హీరో నందకిషోర్, చెల్లెలు పాత్రధారి ఉష, రవివర్మ బళ్లా , దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సినిమాటోగ్రాఫర్ కర్ణ ప్యారసాని, ప్రముఖ నటుడు సమీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహపురం చిత్ర బృందాన్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. నరసింహపురం సినిమాకు ఘన విజయం సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. నరసింహపురం చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్న చిత్ర యూనిట్‌కు అభినందనలు. పరిశ్రమ కళకళలాడాలంటే ఇలాంటి మీడియం బడ్జెట్ చిత్రాలు భారీ విజయాలు సాధించాల్సిన అవసరం చాలా ఉంది అని అన్నారు.
హీరో నందకిషోర్ మాట్లాడుతూ... ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడు మా సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసి... చాలా బాగుందని మెచ్చుకోవడం మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెంచింది. ఆయనకు మా యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. నరసింహపురం' చిత్రాన్ని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.
గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పీఆర్ క్రియేషన్స్ సమర్పణలో టి ఫణిరాజ్‌గౌడ్, నందకిశోర్ ధూళిపాలతో కలిసి 'శ్రీరాజ్ బళ్లా' స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రం రూపొందింది.

నటీనటులు: కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ తదితరులు
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా
నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల
సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్
పాటలు: గడ్డం వీరు
పీఆర్వో: ధీరజ్-అప్పాజీ
మేకప్: కేవీ బాబు
పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్ ఎం
వీఎఫెక్స్: చందు ఆది
కెమెరా: కర్ణ ప్యారసాని
ఎడిటింగ్ & డి.ఐ: శివ వై.ప్రసాద్
5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు


Click it and Unblock the Notifications











