రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే.. లేకపోతే..
Kasthuri Shankar: అలనాటి నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్ మా ( Star Maa)లో ప్రసారమైనా 'ఇంటింటి గృహాలక్ష్మి' సీరియల్ ద్వారా తులసిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సీరియల్ తో కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆమె నటి గానే కాకుండా.. అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ సేవలందిస్తున్నారు. అయితే.. ఈ అమ్మడు ముక్కు సూటిగా మాట్లాడుతూ ఎన్నో సమస్యల్లో కూరుకుపోతుంటారు. అయితే తాజా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ లోని పలు విషయాలను వెల్లడించింది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటీ?
సీనియర్ నటి కస్తూరి శంకర్ అలియాస్ కస్తూరి. తొలుత ఫ్యాషన్ రంగంపై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ అడుగుపెట్టింది. అలా 1991లో మిస్ చెన్నైగా గెలుపొందారు. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా సెలక్ట్ అయ్యారు కస్తూరి. ఈ ఫేమ్ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో వరుస అవకాశాలను అందుకుంటూ.. వరుస విజయాలు అందుకుంది. ఈ తరుణంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఇలా తెలుగులో గ్యాంగ్ వార్ చిత్రం ద్వారా పరిచయమయ్యారు.

ఆ తరువాత బాలకృష్ణతో నిప్పు రవ్వ, చిలక్కొట్టుడు, అన్నమయ్య సినిమాల ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆకాశ వీధీలో, శమంతకమణి, గాడ్ ఫాదర్, సింబా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక తన కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. అనంతరం కొంత కాలానికి సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు.తన సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ,అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తూ..క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెంచుకుంది. ఈ సమయంలో బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చినా ఈ అమ్మడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సీరియల్స్, షోలు చేస్తూ.. ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
అలాగే.. సోషల్ మీడియాతో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ద్రుష్టికి వచ్చిన విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. తాజాగా.. తెలుగు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో కస్తూరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆమె ఇబ్బందుల్లో పడింది. తెలుగు వారాంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో ఆమెపై కేసు నమోదు అయింది. ఈ కేసులో కస్తూరి శంకర్ మూడు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం కూడా గడిపారు. బెయిల్ పై బయటకు వచ్చారు.
ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ కస్తూరి గారు మీకు ఓ అడిక్షన్ ఉందట కదా.. ఆ విషయాన్ని బయట పెట్టమంటే పెడతానంటూ అంటుంది. 'ఇప్పటికే తనను తమిళనాడులో తాగుబోతు అంటున్నారు. ఇప్పుడేమో అడిక్షన్స్ అంటున్నారు వద్దులే' అంటుంది. కానీ ఆ యాంకర్..'ఆ అడిక్షన్ ఏంటంటే.. రాత్రి 9 దాటితే కస్తూరి గారికి ఉవ్విల్లూరుతాయి. ఆ కోరికను వద్దు.. వద్దు.. అని తనకు తాను చెప్పుకున్న .. ఆ కోరికను ఓవర్ కం కాలేకపోతున్నారని అంటుంది.

ఆ కోరిక ఏమిటంటే.. అనగానే.. కస్తూరి మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి తాను లొంగిపోతున్నా.. కొన్నిసార్లు తెల్లారి అది తలుచుకుని గిల్టీగా ఫీల్స్ అవుతున్నా.. మరోసారి దాన్ని జోలికి వెళ్లొద్దని భావిస్తాను. కానీ దానికి ఆడిట్ అయిపోయాను అంటూ.. రాత్రి 9 దాటితే బంగాళదుంప చిప్స్ తినకపోతే తనకు ఆ రాత్రి నిద్ర పట్టదు 'అంటూ అసలు విషయాన్ని బయట పెట్టేసింది నటి కస్తూరి శంకర్.


Click it and Unblock the Notifications











