‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పవన్ కల్యాణ్.. ఆ కూటమికే భారీ మెజార్టీ’

సినీ రంగం నుంచి ప్రజా జీవితంలోకి వెళ్లిన ప్రముఖుల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన ప్రసంగాన్ని ఓ వర్గం వక్రీకరించడం సోషల్ మీడియాలో వివాదంగా మారింది. అయితే ఏపీలో ఎన్నికల సమయంలో జనసేనాని మాటలను వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నించడంతో సీనీయర్ నటుడు, మాజీ బీజేపీ నేత వీకే నరేష్ సోషల్ మీడియాలో స్పందించారు. అయితే ఈ వివాదం ఏమిటి? ఇంతకు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారు అనే వివరాల్లోకి వెళితే..

ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో సిద్దాంతపరమైన విభేదాలే ఉండాలి. కానీ వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు తీశాడు. రాజకీయ ప్రసంగాల్లో విమర్శలు చేశారు. కానీ ఏనాడు కృష్ణ గారిని ఎన్టీఆర్ ఇబ్బందికి గురి చేయలేదు అని అన్నారు.

Telugu Actor VK Naresh says Pawan Kalyan future of Andhra Pradesh Predicts NDA s Thumping Victory

అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించడమే కాకుండా ఎడిట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి కొందరు వ్యక్తిగతంగా లబ్ది పొందేందుకు ప్రయత్నించారు. దాంతో వీకే నరేష్ స్పందించి ఇలాంటి వాటికి తావు లేదు. రాజకీయంగా విమర్శించుకోవాలే తప్పా.. వ్యక్తిగతంగా ప్రస్తుతం లేని వారిపై బురద జల్లడం సరికాదు అని అన్నారు.

Telugu Actor VK Naresh says Pawan Kalyan future of Andhra Pradesh Predicts NDA s Thumping Victory

వీకే నరేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. సూపర్‌స్టార్ కృష్ణ గారిని పవన్ కల్యాణ్ విమర్శించారని విని దిగ్బ్రాంతికి గురయ్యాను. కానీ కృష్ణ గారి హృదయం గోల్డ్. ఉత్తమ విలువలను పాటించిన పార్లమెంటేరియన్. సినీ, రాజకీయ రంగాలకు ఎనలేని సేవ చేశారు. ఆయన ఎప్పుడూ కూడా రాజకీయంగానే తప్పా.. వ్యక్తిగతంగా విమర్శించలేదు అని వీకే నరేష్ అన్నారు.

Telugu Actor VK Naresh says Pawan Kalyan future of Andhra Pradesh Predicts NDA s Thumping Victory

అయితే వాస్తవం తెలుసుకొన్న తర్వాత వీకే నరేష్ మరోసారి సోషల్ మీడియాలో స్పందించారు. కృష్ణ గారి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే వెంటనే డిలీట్ చేయాలని సవినయంగా మనవి చేసుకొంటున్నాను అంటూ పవన్ కల్యాణ్‌పై నరేష్ ప్రశంసలు కురిపించారు.

Telugu Actor VK Naresh says Pawan Kalyan future of Andhra Pradesh Predicts NDA s Thumping Victory

నాకు పవన్ కల్యాణ్ అంటే యాక్టర్‌గా, పొలిటిషియన్‌గా నాకు అమితమైన గౌరవం. ఆయనను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుగా బీజేపీ జాతీయ కార్యదర్శి, యూత్ ప్రసిడెంట్‌గా చూస్తున్నాను. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ సాధిస్తుందనే ప్రగాఢ నమ్మకంతో ఉన్నాను. అంతేకాకుండా ఈ విజయంతో ఏపీ ప్రతిష్ట, అభివృద్ది మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాను. జై శ్రీరాం అంటూ వీకే నరేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X