Rave Party: మరో వివాదంలో సినీ నటి హేమ.. జైలు నుంచి బయటకు వస్తూ!

దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనం రేపిన బెంగళూరు డ్రగ్స్ అండ్ రేవ్ పార్టీలో సినీ నటి హేమ అరెస్ట్ కావడం తెలిసిందే. గతనెల ప్రముఖ వ్యాపారవేత్త జన్మదిన వేడుకల్లో భారీగా డ్రగ్స్ వినియోగించినట్టు వచ్చిన ఆరోపణల కేసులో ఆమెను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆమెకు ఈ కేసులో బెయిల్ లభించింది. అయితే జైలు నుంచి విడుదలైన సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో వైరల్అ య్యాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమ అడ్డంగా బుక్కైంది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమెను విచారించేందుకు సెంట్రల్ క్రైమ్ విభాగం పోలీసులు నోటీసులు పంపారు. అయితే ఆమె నోటీసులకు స్పందించకపోవడంతో ఆమెను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తరలించారు.

Telugu Actress Hema landed in another Controversy after release from Jail in Bangalore Rave Party case

ఇక బెంగళూరులో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించారు. అయితే ఆమె బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. దాంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు.

అయితే బెయిల్ లభించిన తర్వాత హేమ జైలు నుంచి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె జైలు గేట్ వద్ద సంతకం చేస్తుండగా ఆమెతో కొందరు ఫోటోలు దిగితూ కనిపించారు. అయితే అనంతరం ఆమె హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సిద్దమయ్యారు.

Telugu Actress Hema landed in another Controversy after release from Jail in Bangalore Rave Party case

ఈ క్రమంలో ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోగా.. వారితో మాట్లాడే పనేముంది? వారితో మాట్లాడాల్సిన అవసరం లేదనే మాటలు ఆమె నుంచి వినిపించాయి. దాంతో ఆమెలో ఉండే ముక్కుసూటి తనం మరోసారి బయటపడింది. అయితే కన్నడ మీడియాలో మాత్రం మీడియాతో మాట్లాడకుండా ఆమె దురుసుగా వెళ్లిందనే కామెంట్స్ వినిపించాయి.

అయితే మీడియాతో హేమ మాట్లాడేందుకు నిరాకరించిందా? లేక సామాన్యులతో మాట్లాడటం ఇష్టం లేక కామెంట్ చేసిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ వీడియోలో క్లారిటీ లేకపోవడం కన్నడ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై హేమ స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X