Breaking: రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్ట్.. బెంగళూరు పోలీసుల అదుపులో..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సెంట్రల్ క్రైమ్ విభాగానికి చెందిన పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ కేసులో దాదాపు 100కుపైగా మంది పాల్గొన్నారనే విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ బర్త్ డే సందర్భంగా జరిగిన పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు పాల్గొన్నారనే వార్తలు గుప్పుమన్నాయి.

అయితే సినీ నటి హేమ మాత్రం అడ్డంగా ఈ కేసులో బుక్కైంది. అయితే ఆమెను సోమవారం అంటే.. జూన్ 3వ తేదీన ఆమెను హైదరాబాద్‌లో బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

Telugu Actress Hema taken custody in Rave Party case By Central Crime of Bangalore

రేవ్ పార్టీని భగ్నం చేసిన తర్వాత హేమ తొలుత బుకాయించింది. తాను హైదరాబాద్‌లోనే ఫామ్ హౌజ్‌లో ఉన్నాను. బిర్యాని చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అంటూ వీడియోను రిలీజ్ చేసింది. అయితే పట్టుపడిన ప్లేస్ నుంచే ఆమె వీడియో రిలీజ్ చేయడం రెడ్ హ్యాండెడ్‌గా ఆమె పట్టుబడింది.

రేవ్ పార్టీ కేసులో హేమ, ఇతర సినీ, వ్యాపార ప్రముఖులకు రక్త పరీక్షలు నిర్వహించారు. అయితే బెంగళూరు పోలీసులు నిర్వహించిన పరీక్షల్లో నమూనాలు పాజిటివ్‌గా రావడంతో కేసు బుక్ చేశారు. అనంతరం ఆమెకు నోటీసుల పంపించగా.. స్పందించలేదు. అయితే మరోసారి ఆమెకు నోటీసులు పంపించినా రియాక్ట్ కాకపోవడంతో నేరుగా బెంగళూరు పోలీసులు హైదరాబాద్‌కు వచ్చారు అని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇప్పటికే రెండుసార్లు నోటీసులు అందుకొన్న నటి హేమ స్పందించకపోవడంతో సోమవారం బెంగళూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తారు అనేది ప్రాథమిక సమాచారం. ఈ విషయంపై బెంగళూరు పోలీసులు, హేమ ఫ్యామిలీ వర్గాలు స్పందించాల్సి ఉంది. దాంతో అధికారికంగా ఆమె అరెస్ట్ విషయం బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X