2024 AP elections: నేను MLA పవన్ కల్యాణ్ గారి తాలూకా.. తెలుగు హీరోయిన్ పోస్ట్ వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నం అయింది. దీంతో అందరిలోనూ ఈసారి అధికారం ఎవరిది అన్న దానిపై తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు ఇటీవవల వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా మిశ్రమ ఫలితాలను చెప్పడంతో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏపీలోని కొన్ని నియోజకవర్గాలపై సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు సైతం బాగా ఫోకస్ చేస్తున్నారు. అందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ఒకటి. తాజాగా దీనిపై తెలుగు హీరోయిన్ మాధవి లత కామెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే...
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన కొన్ని నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడమే దీనికి కారణం అని తెలిసిందే. అక్కడ ఓటు వేసి జనసేనానిని గెలిపించేందుకు లక్షల సంఖ్యలో ఓటర్లు ముందుకు వచ్చారు. వేరే ప్రాంతాల నుంచి కూడా పనిగట్టుకుని మరీ విచ్చేశారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పిఠాపురం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. దీనికి కారణం అక్కడ గెలిచేది పవన్ కల్యాణే అని రిపోర్టులు రావడమే. దీంతో అక్కడి జనసేన కార్యకర్తలు తమ తమ వాహనాలకు 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అనే నెంబర్ ప్లేట్‌లను తయారు చేయించుకున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసింది.
'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అనే నెంబర్ ప్లేట్ సెన్సేషన్ అవుతోన్న నేపథ్యంలో తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ మాధవి లత దీనిపై స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అనే నెంబర్ ప్లేట్ బోర్డు ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, 'మీరు కూడానా' అంటూ తన ఫాలోవర్లను ప్రశ్నించింది.

తాజాగా హీరోయిన్ మాధవి లత షేర్ చేసిన ఈ ఫొటో కొద్ది సమయంలోనే వైరల్‌గా మారిపోయింది. ఇక, ఈమె చేసిన దీనిపై చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు మాధవి లతకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ, వైసీపీ వీరాభిమానులు మాత్రం ఈ తెలుగు హీరోయిన్‌పై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మాధవి లత చాలా కాలం ముందే భారతీయ జాతీయ పార్టీలో చేరింది. అప్పటి నుంచి ఈమె రాజకీయాలతో పాటు సామాజిక అంశాలపై తన గొంతును వినిపిస్తోంది. అదే సమయంలో ఈ ఎన్నికల కోసం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రచారాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











