లాక్‌డౌన్‌లో పూర్తిగా మారిపోయిన సీనియర్ నటి రాశి.. హాట్ లుక్ అదిరింది!
టాలీవుడ్ సీనియర్ నటి రాశి అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అందమైన నటి కెరీర్ మొదట్లో రెండు తరాల జనరేషన్ ని పూర్తిగా తనవైపుకు తిప్పుకుంది. నేటితరం యువతరం కూడా రాశి అందానికి ఫిదా అవుతున్నారు. గతంలో బొద్దుగా కనిపించిన రాశి ఎప్పుడు లేని విధంగా సరికొత్త లుక్ తో దర్శనమిస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె అందం కూడా పెరుగుతోంది.

బ్బ్యూటీఫుల్ హీరోయిన్..
తెలుగు హీరోయిన్స్ లలో ఆల్ టైమ్ టాప్ బ్యూటీఫుల్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే.. ఆ లిస్ట్ లో నటి రాశి ఉంటుందనే చెప్పాలి. క్యూట్ గా నవ్వుతోనే ఎంతో మంది కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈ సీనియర్ హీరోయిన్ అప్పట్లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది. తమిళ్ కన్నడ మలయాళంలోనే కాకుండా హిందీ భాషలో కూడా పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తరువాత చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది.

లాక్ డౌన్ లో కొత్త లుక్..
ఇక చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో రాశికి సంబంధించిన లుక్ వైరల్ అవుతోంది. లాక్ డౌన్ లో ఆమె కొత్త లుక్ కోసం ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒక సినిమాలో నటిస్తున్న రాశి షూటింగ్ లో కూడా పాల్గొంది. కరోనా టైమ్ లో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటోంది.

వయసు పెరుగుతున్నా..
రాశిని చాలా రోజుల తరువాత చూస్తున్న కొంతమంది అభిమానులు ఆశ్చర్యనికి లోనవుతున్నారు. ఎందుకంటే వయసు పెరుగుతున్నా ఆమె అందంలో పెద్దగా తేడా రాలేదని ఇంకా ఆ అందం పెరిగిందనే కామెంట్స్ వస్తున్నాయి. జులై 29కి ఆమె 40లోకి రానుంది. నాలుగు పదుల వయసు దాటుతున్నా ఇంకా పాతికేళ్ల అమ్మాయిలనే ఉందనిపిస్తోంది.

ప్రేక్షకులకు దగ్గరగా..
ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న రాశి అనుకున్నంతగా అవకాశాలు అందుకోవడం లేదు. మెల్లగా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. లాక్ డౌన్ లో ఓ వర్గం నటులు చాలా వరకు ప్రేక్షకులకు దూరంగా ఉన్నప్పటికీ రాశి మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. ఆడియెన్స్ మర్చిపోకుండా యూ ట్యూబ్ ఛానెల్ తో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది.


Click it and Unblock the Notifications











