Rithu Chowdary: రేవ్ పార్టీకీ నేను కూడా వెళ్లాలనుకున్నాను.. షాకిచ్చిన తెలుగు యాంకర్!
అచ్చమైన తెలుగు అమ్మాయి.. బుల్లితెరపై తెగ గ్లామర్ షో చేస్తున్న హాట్ యాంకర్ రీతూ చౌదరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అన్ని రకాల ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తెగ గ్లామర్ షో చేస్తోంది. జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసిన ఈమె.. ప్రస్తుతం దావత్ అనే షోకు యాంకర్ గా కూడా చేస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఈవెంట్ కు హాజరు అయి షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా రేవ్ పార్టీకి తాను కూడా వెళ్లాలి అనుకున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రీతూ చౌదరికి సినిమాలపై ఉన్న ఆసక్తితో యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. ఇలా చాలా కాలం పని చేసిన తర్వాత గోరింటాకు అనే సీరియల్ చేసింది. ఆ తర్వాత సూర్య వంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొనడంతో రీతూ విపరతీమైన క్రేజ్ దక్కించుకుంది. చాలా రోజుల పాటు ఇలా నటించిన ఈమె జబర్దస్త్ షోలో పాల్గొంది. ఓ స్కిట్ చేసి అదరగొట్టగా.. వరుసగా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి.

ఇలా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈమె ప్రస్తుతం దావత్ అనే షో చేస్తూ రెచ్చిపోతుంది. అలాగే బయట జరిగే అనేక ఈవెంట్లకు కూడా హాజరవుతూ తెగ సందడి చేస్తోంది. అయితే తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన ఈమె షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా ఇటీవలే తెలుగు సినీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రేవ్ పార్టీ గురించి మాట్లాడింది. ముఖ్యంగా ఇటీవలే బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన సినీ నటులు అందరిపై ఉచ్చు బిగుసుకుంటోంది. ముఖ్యంగా పార్టీకి హాజరైన వారందరికీ టెస్టులు నిర్వహించడంతో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ చేశారు.
అయితే ఇందులో నటి హేమ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. అయితే తాజాగా నటి, యాంకర్ రీతూ చౌదరి స్పందించింది. తాను కూడా రేవ్ పార్టీకి వెళ్లాలనుకున్నట్లు చెప్పింది. తాను రేవ్ పార్టీ అంటే ఎలా ఉంటుందో చూడాలని అనుకుందట. అక్కడ ఏం చేస్తారో కూడా తనకు తెలియకపోవడం వల్ల ఓసారి వెళ్తే బాగుంటుందని ఫీల్ అయిందట. కానీ ఇటీవలే జరిగిన రేవ్ పార్టీలో అసాంఘీక కార్యకలాపాలు సాగించినట్లు తెలిసి ఇలా ఉంటుందా అని షాక్ అయిందట.

ఇలాంటి పార్టీలకు తాను చాలా దూరం అని యాంకర్ రీతూ చౌదరి వెల్లడించింది. తెలియకముందు వెళ్లాలి అనిపించినా అదేంటో తెలిసాకా దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అర్థం అయినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రీతూ చౌదరి చేసిన ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. నువ్వు ఈ పాటికే వెళ్లి ఉండొచ్చని కొందరు.. అక్కా జాగ్రత్త, ఎలాంటి పార్టీలు అయినా దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా వెళ్లొందంటూ మరి కొంత మంది చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











