Priya: చీరలో గ్లామర్ డోస్ పెంచుతున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ.. ఈ వయసులో కూడా స్టన్ అయ్యేలా..
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే కేవలం వెండితెరపై మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వారి అందంతో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక ఎక్కువగా సహాయక పాత్రలలో కనిపించి మంచి గుర్తింపు అందుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా గురించి అందరికీ తెలిసిందే. ఆమె మరోసారి సోషల్ మీడియాలో తన అందంతో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చీరలోనే మరోసారి గ్లామర్ డోస్ పెంచింది. ఆ వివరాల్లోకి వెళితే..
మొదట ఆ రూట్లో..:సినిమా ఇండస్ట్రీలో కొంతమంది లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు నటనతోనే ఎంతగానో గుర్తింపు అందుకున్నారు. ఇక ఆ రూట్లో వచ్చి మర్చిపోలేని విధంగా గుర్తింపును అందుకున్న వారిలో ప్రియా ఒకరు. ఆమె అసలు పేరు శైలజ. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ప్రియా అని పేరు మార్చుకున్నారు. మొదట హీరోయిన్ గా గుర్తింపును అందుకోవాలని అనుకున్న ప్రియా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

మంచి టైమింగ్ ఉన్న రోల్స్:ఆంధ్రప్రదేశ్ బాపట్ల కు చెందిన ప్రియ అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా మారిపోయింది. మొదట మాత్రం ఆమె మెయిన్ లీడ్ లో నటించాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ పెద్దగా ఆ రూట్లో ఆమె సక్సెస్ కాలేకపోయింది. కొన్ని చిన్న చిన్న సినిమాల్లో కూడా ఆమె మంచి టైమింగ్ ఉన్న రోల్స్ చేసింది. ఎలాంటి పాత్ర చేసిన కూడా అందులో ఎమోషన్ హైలైట్ అయ్యే విధంగా నటించడంలో ప్రియా తన ప్రత్యేకతను చాటుకుంటుంది.

అలా మొదలైన కెరీర్:1997 దొంగాట సినిమా ద్వారా మొదలైన ప్రియా కెరియర్ ఇప్పటివరకు నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా మలయాళం కన్నడం అలాగే తమిళ సినిమాల్లో కూడా ఆమె మంచి పాత్రలు చేసింది. ఆమె క్యారెక్టర్స్ నిడివి తక్కువగా ఉన్నా సరే సన్నివేశంలో ఎంతో కొంత ఇంపాక్ట్ ఉండే విధంగానే ప్రియా నటిస్తూ ఉంటుంది. అందుకే ఆమెకు చాలా ఎక్కువ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి.

మిర్చి సినిమాలో ఆమె నటన..:తెలుగులో అయితే ఆమెకు కొన్ని మర్చిపోలేని పాత్రలు అందుకుంది. ముఖ్యంగా మిర్చి సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అలాగే ఉప్పెన సినిమాలో కూడా ఆమె నటించిన విధానం కూడా బాగా వర్క్ అవుట్ అయింది. ఇక వెంకీ మామ, జాంబీ రెడ్డి, శ్రీకారం వంటి సినిమాల్లో కూడా ఆమె మంచి పాత్రలు చేసింది. అలాగే సీరియల్స్ లో కూడా అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ రోల్స్ చేస్తోంది.

సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్:ఇక ఎక్కువ స్థాయిలో అయితే బిగ్ బాస్ ద్వారా ప్రియకు మరో స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అప్పటినుంచి ఎక్కువగా పెరిగిపోయింది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకుంటూ కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఎలాంటి స్టిల్ ఇచ్చిన కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవ్వాల్సిందే.
చీరలో ఆ అందాలు హైలెట్:ఇక రీసెంట్ గా ప్రియా పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే ఎవరైనా సరే స్టన్ అవ్వాల్సిందే. చీరలో ఆమె ఎద అందాలు హైలైట్ అయ్యే విధంగా అలాగే నడుము అందాలు కూడా కనిపించే విధంగా దర్శనమిచ్చింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రియా కాస్త గ్లామర్ డోస్ పెంచింది. దీంతో ఫాలోవర్స్ ఆమె అందాన్ని పొగుడుతూ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
ప్రియా నాలుగు పదుల వయసు దాటినా కూడా చెరగని అందంతో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











