వయసులో చిన్నవాడైన అలీరెజాతో అక్రమ సంబంధం సీన్.. ఆ బోల్డ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన!

కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బాహ్య ప్రపంచంలో ఎక్కువగా మీడియా ముందుకు రాకపోయినా సినిమాల ద్వారా మాత్రం చెరగని ముద్ర వేసుకుంటారు. ఇక అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో షానూర్ సన ఒకరు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన సన తన పర్సనల్ లైఫ్ గురించి బయట పెద్దగా ఎప్పుడు చెప్పుకోలేదు. ఇక ఆమె మధ్య ఆమె అలీ రేజాతో ఒక రొమాంటిక్ సీన్ చేసిన విధానం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయం గురించి సన ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

600 పైగా సినిమాలు

600 పైగా సినిమాలు

తెలుగులో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులలో గుర్తిండి పోయే పాత్రలు చేస్తూ ఉంటారు. అలాంటి పాత్రలు చేసిన వారిలో సనా కూడా ఒకరు. చిన్నతనంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పటివరకు దాదాపు 600 పైగా సినిమాలలో అనేక సీరియల్స్ లో కూడా నటించారు.

మొదట మోడల్

మొదట మోడల్

సన మొదట మోడల్ గా ప్రయత్నం చేసి హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అని అనుకుంది. ఇక ఆమెకు ఆ రూట్లో సరైన అవకాశాలు రాకపోవడం వలన టెలివిజన్ సీరియల్స్ చేసింది. ఇక నిన్నే పెళ్లాడతా సినిమా ద్వారా సహా నటిగా కెరీర్ స్టార్ట్ చేసి మంచి గుర్తింపు అందుకుంది. ఇక ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది.

అలీ రెజాతో రొమాంటిక్ సీన్లు

అలీ రెజాతో రొమాంటిక్ సీన్లు

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ మధ్య ఆహా లో విడుదలైన మెట్రో కథలు అనే ఒక సిరీస్ లో తనకంటే చాలా చిన్నవాడైనా అలీ రెజాతో రొమాంటిక్ సీన్లు నటించింది. భర్త యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లోనే ఉంటే అలీ తేజా క్యారెక్టర్ ఇంట్లో డ్రాప్ చేస్తానని చెబుతుంది. ఇక అక్కడ ఎమోషనల్ గా రొమాన్స్ చేసిన విధానం హైలెట్ అవుతుంది. ఇక ఆ సీన్ విషయం మీద సనా తాజాగా కామెంట్లు చేసింది. ఒక యూ ట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికరంగా స్పందించింది.

 అలాంటి పాత్ర చేయడానికి కారణం

అలాంటి పాత్ర చేయడానికి కారణం

తాను ఆ సిరీస్ లో అలాంటి పాత్ర చేయడానికి కారణం డైరెక్టర్ కరుణ కుమార్, రైటర్ ఖాదీర్ బాబు అని ఆమె అన్నారు. 'మెట్రో కథలు' సిరీస్ లో నేను చేసిన పాత్ర ఒక మిడిల్ క్లాస్ మహిళ పాత్ర. అందులో ఒక మిడిల్ క్లాస్ మహిళ ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది? తాగుబోతు భర్త ఇంట్లో ఉండి, భార్యని పట్టించుకోకపోతే బయట జనం చూస్తారు, వాళ్లను తప్పించుకుంటూనే ఇంటి బాధ్యతలు చక్కబెట్టడం ఎలా అనే అంశాలతో పాటు లోలోపల కోరికలు కూడా కలుగుతూ ఉన్నా అనుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని చూపించారు.

అలాంటి పాత్రలు వస్తే..

అలాంటి పాత్రలు వస్తే..

నిజానికి వెబ్ సిరీస్ లో పాత్ర ప్రకారం చూస్తే కొంచెం నేను బోల్డ్ పాత్ర చేశాను అనుకోవచ్చు. కానీ నా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ లో ఇలాంటి మెసేజ్ ఉన్న పాత్ర వస్తే చేయడంలో తప్పేమీ లేదనే ఉద్దేశంతో నేను ఆ పాత్ర చేశానని ఆమె పేర్కొన్నారు. బోల్డ్ పాత్రలైనా దానివల్ల ఏదైనా మెసేజ్ జనాల్లోకి వెళుతుంది అంటే అందులో నటించడానికి ఏమాత్రం వెనకాడనని ఆమె చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X