తమిళ హీరోయిన్ ప్రైవేట్ వీడియోలతో.. తెలుగు దర్శకుడు బ్లాక్ మెయిల్!
తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండే దర్శకుడిపై ఉన్నట్టుండి సోషల్ మీడియా, వాట్సాప్‌లో ఆయనకు ప్రతికూలంగా కొన్ని పోస్టులు పెడుతూ సంచలన రీతిలో రూమర్లు వెల్లడిస్తున్నారు. గత రెండు, మూడు వారాలుగా కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకొన్న డైరెక్టర్‌పై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ సదరు దర్శకుడి గురించి జర్నలిస్టులకు వాట్సప్ ద్వారా సందేశాలు చేరవేసి వివాదాన్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దర్శకుడికి సంబంధించిన వివాదస్పద అంశంలోకి వెళితే..
రెండు వారాలత క్రితం జర్నలిస్టుల వాట్సప్‌కు ఓ సందేశం ఆకాశరామన్న రూపంలో వచ్చింది. ఓ ప్రముఖ దర్శకుడు, తమిళ హీరోయిన్‌తో అక్రమ సంబంధం పెట్టుకొని రొమాన్స్ చేస్తున్నాడు. ఆయన భార్య, కుటుంబానికి ఈ అంశం కీడు చేసేలా ఉంది. కాబట్టి జర్నలిస్టులు ఈ విషయాన్ని గుర్తించాలి అంటూ సదరు ఆకాశరామన్న సందేశాన్ని చేరవేశాడు. ఆ సందేశం పంపించిన మళ్లీ కొద్ది రోజులకు రెండు, మూడు మెసేజ్‌లో వచ్చాయి.

దర్శకుడు, తమిళ హీరోయిన్ రిలేషన్‌షిప్ వ్యవహారం గాసిప్ కాదు. వారిద్దరి డేటింగ్, అఫైర్ లైఫ్‌ను బయట పెట్టకపోతే.. మీరు సహాయం చేయకపోతే ఓ రోజుకు ఇది తీవ్రమైన సమస్య అవుతుంది. తెలుగు దర్శకుడు, తమిళ నటితో నిరంతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు అంటూ ఓ మెసేజ్ చేరవేశాడు. అయితే ఆ మెసేజ్‌ను మీడియా పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇక అదే దర్శకుడు, ఆ హీరోయిన్ వాలంటైన్ డే ప్లాన్స్ గురించి మరో సందేశం వచ్చింది. ప్రేమికుల రోజున తమిళ నటితో దర్శకుడు భారీ ప్లాన్స్ వేసుకొన్నాడు. మంచి పార్టీని ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసుకోవాలనుకొంటున్నారు. కాబట్టి ఆయన కుటుంబానికి హాని కలుగకుండా జర్నలిస్టులు సహాయం చేయాలి అని అన్నారు.

అదే విధంగా మరో మెసేజ్‌ను ఆకాశరామన్న పేరుతో పంపించారు. తెలుగు దర్శకుడు తన ప్రేయసి తమిళనటి గురించిన ప్రైవేట్, పర్సనల్ వీడియోలు తన వద్ద పెట్టుకొన్నాడు. వాటిని బేస్ చేసుకొని ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. కాబట్టి ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని వెంటనే రక్షించండి అంటూ మెసేజ్ పంపడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. ఈ విషయంపై సదరు డైరెక్టర్ స్పందిస్తాడా? లేదా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











