twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    PawanKalyan మాటలు వ్యక్తిగతం.. ఫిలిం చాంబర్ సంచలనం.. ఏపీ ప్రభుత్వానికి థాంక్స్.. మేం చెప్పేదే ఫైనల్ !

    |

    నిన్న రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పలువురు మంత్రులు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు రంగంలోకి దిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ అసలు పవన్ కళ్యాణ్ మాటలకు మాకు సంబంధం లేదన్నట్లుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రకటన సంచలనంగా మారింది. ఈ ప్రకటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

    మేమే కలిశాం

    మేమే కలిశాం

    తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ దాస్ నారంగ్ ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. కరోనా మహమ్మారితో పాటు అనేక ఇతర సమస్యల గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించిందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ ఆందోళన వ్యక్తం చేశారని లేఖలో పేర్కొన్నారు .

     ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు

    ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు

    ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్న ఆయన జగన్ మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకోవడమే కాక మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించారని అన్నారు. అలాగే సమీప భవిష్యత్తులో మా ఆందోళనలన్నీ మాకు సానుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు అని తెలిపారు.

     అత్యంత దయనీయమైన పరిస్థితిలో

    అత్యంత దయనీయమైన పరిస్థితిలో

    రాష్ట్ర విభజన సహా కరోనా మహమ్మారి మొదలు అనేక ఇతర సమస్యల కారణంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితి కారణంగా, మా పరిశ్రమ అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉందని దాని గురించి చాలా మంది మ అభిప్రాయాలను మరియు ఆవేదనను వివిధ వేదికలపై వ్యక్తం చేశారు కానీ ఇది పరిశ్రమ యొక్క అభిప్రాయం కాదని, వారి వ్యక్తిగత అభిప్రాయం అని అనంరు. ఇక మా పరిశ్రమ యొక్క అపెక్స్ బాడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని మరో సారి పునరుద్ఘాటించాలనుకుంటున్నామని ఆయన అన్నారు.

    మద్దతును అందించడం అవసరం

    మద్దతును అందించడం అవసరం

    అనేక సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నాయని, వారి మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాగించలేమని అన్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది ప్రజలు మరియు వారి కుటుంబాలు మార్చి 2020 నుండి బాధపడుతున్నారని, ఈ తరుణంలో మన నాయకులు మరియు ప్రభుత్వాలు పెద్ద మనసుతో వారి నిరంతర మద్దతును అందించడం చాలా అవసరం అని ఆయన పేర్కొన్నారు.

    Recommended Video

    SP Balasubrahmanyam : సజీవ మూర్తిగా ఎస్పీ బాలు.. చీకటి వెలుగులతోపాటు | Mohan Lal | Filmibeat Telugu
     తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు

    తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు

    ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు టాలీవుడ్ చిత్రసీమకు రెండు కళ్ళు అని ఇద్దరు ముఖ్యమంత్రులు మాకు సహాయం చేయడంలో చురుగ్గా ఉన్నారని, వారి ప్రోత్సాహం మరియు మద్దతు ఎల్లప్పుడూ మాకు అందించారని చెబుతూ ఆయన లేఖ రాశారు. వారి నిరంతర దీవెనలు మరియు మద్దతు కోరుతున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు.

    English summary
    Telugu Film Chamber release Press Note on Pawan Kalyan comments against andhra pradesh government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X