తమిళ హీరోయిన్‌తో తెలుగు డైరెక్టర్‌ రొమాంటిక్ లీలలు.. అక్రమ సంబంధం గురించి వాట్సప్‌లో లీకులు!

సినిమా పరిశ్రమలో అక్రమ సంబంధాలు, అఫైర్లు, డేటింగ్ విషయాలకు కొదవ ఉండదనేది అందరికి తెలిసిందే. కొన్నిసార్లు అఫైర్లు ఉంటాయో లేదో తెలియదు కానీ నిప్పు లేకున్నా పొగ రావడం ఇండస్ట్రీలో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా గతంలో స్టార్ హీరోలతోపాటు కుర్ర హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన టాప్ దర్శకుడి గురించి ఓ వార్త వాట్సాప్ చాట్‌లో చక్కర్లు కొడుతున్నది. అయితే జర్నలిస్టుల మొబైల్ ఫోన్లకు ఆకాశరామన్న మెసేజ్ పంపించి సదరు డైరెక్టర్ అక్రమ సంబంధం గురించి ప్రచారం చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఇండస్ట్రీలో సాధారణంగా వెబ్‌సైట్స్, లేదా గాసిప్ పత్రికల్లో సినీ తారల గురించిన అఫైర్లు, డేటింగ్ విషయాలు వస్తుంటాయి. కానీ కొత్తగా ఓ యువ డైరెక్టర్ వైవాహిక జీవితం గురించి మీడియాకు హింట్ ఇస్తూ మెసేజ్ రూపంలో లీకులు ఇస్తున్నారు. అయితే ఆ లీకులు ఎవరు ఇస్తున్నారు? అలా ఇచ్చే వారి వెనుక ఉన్న వారెవరు? అనే విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Telugu Film Director romance with Tamil Young Heroine in illegal Relation WhatsApp Chat circulating in Media Groups

వాట్సప్‌ ఛాట్‌గా వస్తున్న ఈ వార్త గురించి వివరాల్లోకి వెళితే.. గతంలో సెన్సిబుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలతో ఫీల్ గుడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్న తెలుగు దర్శకుడు ఇటీవల కొన్ని యాక్షన్ సినిమాలు తీసి చేతులు కాల్చుకొన్నాడు. అయితే తాజాగా ఆ డైరెక్టర్ పేరుతో తమిళ రంగానికి చెందిన యువ హీరోయిన్ పేరు జోడిస్తూ అక్రమ సంబంధం వార్త రావడం సంచలనంగా మారింది.

వాట్సప్ మెసేజ్‌ రూపంలో వచ్చిన దేమిటంటే.. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తన భార్యను మోసం చేస్తున్నాడు. తమిళ నటితో అక్రమ సంబంధాన్ని పెట్టుకొన్నాడు. ఆ తెలుగు డైరెక్టర్, తమిళ యువ హీరోయిన్ హైదరాబాద్, చెన్నైలో ఉంటున్నారు. రెండు నగరాల మధ్య ప్రయాణం సాగిస్తూ రొమాన్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి వివాహేతర సంబంధం తెలుకొన్న డైరెక్టర్ భార్య మదనపడిపోతున్నారు. తన కుటుంబాన్ని రక్షించాలని తన సన్నిహితులు, శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నారు అనేది వాట్సప్ మెసేజ్ సారాంశం.

Telugu Film Director romance with Tamil Young Heroine in illegal Relation WhatsApp Chat circulating in Media Groups

అయితే డైరెక్టర్ వివాహేతర సంబంధంలో ఓ ట్విస్టు కూడా బయటకు వచ్చింది. అయితే సదరు డైరెక్టర్ భార్య సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ఆయన సపర్యలు చేస్తూ చేదోడు వాదోడుగా కూడా ఉన్నారు. ఆమె అరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు, వైద్యం చేయించాడు అంటూ సదరు డైరెక్టర్ గురించి మరో వార్త బయటకు వచ్చింది. అయితే ఆ డైరెక్టర్ గురించి ఇలా లీకులు ఇవ్వడం వెనుక అసలు కథ ఏమిటనేది తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X