దిల్ రాజు సినిమాకు ఊహించని షాక్.. సంక్రాంతి ఫైట్ లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్విస్ట్!

సంక్రాంతి అనగానే ఒకేసారి సినిమాలు అన్నీ కూడా విడుదల తేదీలను అనౌన్స్ చేస్తూ ఉంటాయి. ఈ ఫెస్టివల్ అనేది తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా తప్పకుండా సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకుంటాయి అని నిర్మాతలు పోటీపడి మరి సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా పెరిగిన నిర్మాణాలు వ్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ స్థాయిలో పోటీ ఉండడానికి నిర్మాతలు ఒప్పుకోవడం లేదు.

ఇక ఈ విషయంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కూడా ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది. వీలైనంతవరకు పోటీ తక్కువగా ఉండే విధంగా చూసుకుంటుంది. అయితే ఈ తరుణంలో సంక్రాంతి ఫెస్టివల్ కు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకే థియేటర్స్ ఇవ్వాలి అనే విధంగా మరొక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.

Telugu film producers council unexpected reaction on dil raju varasudu

అందులో చలనచిత్ర లో పెరిగిన నిర్మాణ వ్యాయామ దృష్టిలో పెట్టుకొని నిర్మాత శ్రేయస్సు కొరకు ఆలోచించి సంక్రాంతి దసరా పండుగలకు స్ట్రైట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వివరణ ఇచ్చారు. అయితే ఇందులోనే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న దిల్ రాజు గతంలో చెప్పినట్లు.. తెలుగు సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాకు థియేటర్స్ ఎలా ఇస్తాము అని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కూడా పొందుపరచడం హాట్ టాపిక్ గా మారింది.

Telugu film producers council unexpected reaction on dil raju varasudu

దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే నిర్మాతల బంద్ సమయంలో దీన్ని తమిళ్ సినిమాగా హైక్ట్ చేశారు. అలాగే వంశీ పైడిపల్లి కూడా తమిళ మీడియాలో అదే తరహాలో ఇది పక్కా తమిళ్ సినిమా అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అయితే నిర్మాతల మండలి మాత్రం తెలుగుచిత్ర పరిశ్రమను కాపాడుకుంటూ సంక్రాంతికి స్ట్రైట్ గా తెలుగు చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలుగా పరిగణించాలని సినిమా ఎగ్జిక్యూటివ్స్ ను కోరుతున్నట్లు నిర్మాతల మండలి సభ్యులు వివరణ ఇచ్చారు. మరి ఈ విషయంపై దిల్ రాజు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X