కిరణ్ అబ్బవరం ’రహస్య’ వివాహం.. డెస్టినేషన్ వెడ్డింగ్‌ ఎప్పుడంటే?

కంటెంట్‌తోపాటు క్వాలిటీ కథలతో వచ్చే సినిమాల ద్వారా ఆడియెన్స్ ఆకట్టుకొంటున్న యువ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల కాలంలో హిట్స్, ఫ్లాపులు అనే తేడా లేకుండా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. ఇలా తెలుగు తెరపైన తన మార్కు సంపాదించుకొన్న ఆయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారనే విషయం మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

రాజా వారు రాణీ గారు చిత్రంతో కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆ సినిమాలో రహస్య గోరక్ హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా షూటింగు సమయంలో జరిగిన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మనసులు కలవడంతో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

Telugu Hero Kiran Abbavaram to tie the knot with Rahasya Gorak on August 22nd

ఇక ఇరు కుటుంబాల అంగీకారంతో మార్చి 13వ తేదీన హైదరాబాద్‌లో కిరణ్, రహస్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ రిసార్డులో జరిగిన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తాజా వారిద్దరూ డెస్టినేషన్ వెడ్దింగ్‌కు ప్లాన్ చేసినట్టు తెలిసింది.

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం. కిరణ్, రహస్య వివాహానికి కేరళ డిస్టినేషన్‌గా మారనున్నది. కేరళలోని అలెప్పీ, మరో ప్రాంతంలోని రిసార్డులో వీరి వివాహం ఆగస్టు 22వ తేదీన జరుగనున్నదని తెలిసింది. ఈ మేరకు పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.

Telugu Hero Kiran Abbavaram to tie the knot with Rahasya Gorak on August 22nd

ఇక పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో సినీ, రాజకీయ, మీడియా వర్గాలకు ఘనంగా విందును ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఆగస్టు 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X