NTR30: ఎన్టీఆర్ మూవీలో ఆ తెలుగు హీరో.. అతడి ట్విస్టే సినిమాకు హైలైట్
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ డబుల్ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకుని ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఇందులో భాగంగానే తన 30వ సినిమాను టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి చేస్తున్నాడు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కించనున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించే ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ, ఈ చిత్రం ప్రారంభోత్సవానికి చాలా అడ్డంకులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత వారంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆ వెంటనే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా కొరటాల టీమ్ మొదలు పెట్టేసింది. అంతేకాదు, హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్‌లో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో వేరే ఇండస్ట్రీలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన శ్రీకాంత్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడారు. 'ఎన్టీఆర్ సినిమాలో చేస్తున్నా. అతడితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సంతోషంగా ఉన్నా. ఇందులో నా పాత్ర పాజిటివ్, నెగెటివ్‌గా ఉంటుంది' అని చెప్పారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ పాత్ర ద్వారా వచ్చే ఓ ట్విస్ట్ సినిమా కథనే మలుపు తిప్పేదిగా ఉంటుందట. అంటే.. ఈ చిత్రంలో ఆయన రోల్ హైలైట్ కాబోతుందని సమాచారం.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











