ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే, దారుణంగా .. ఆధారాలతో సహా బయటపెట్టిన తెలుగు హీరోయిన్
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువమందే ఉన్నారని చెప్పాలి. దీనికి చాలా కారణాలే కనిపిస్తాయి. మన వాళ్ళని మనోళ్లే ఎంకరేజ్ చెయ్యరు అని, ఎప్పుడు మనోళ్ళకి పొరుగింటి పుల్ల కూరే ఇష్టం అంటూ కొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగు రాని హీరోయిన్స్ తెచ్చుకొని మరీ వారి చేత వచ్చీ రాని డైలాగ్ మాడ్యులేషన్ లతో సినిమాలు చేయించుకుంటారని మన తెలుగు యువ హీరోయిన్స్ చెబుతూ ఉంటారు.
తెలుగు సినిమా విషయంలో, తెలుగు హీరోయిన్స్ విషయంలో ఇలా కంప్లైంట్స్ ఉన్న వారిలో యువ నటి చాందిని చౌదరి కూడా ఒకామె అని చెప్పాలి. పక్కా తెలుగు మాట్లాడే ఈ తెలుగమ్మాయి హార్ట్ బ్రేకింగ్ సినిమా "కలర్ ఫోటో" తో బాగా పేరు తెచ్చుకుంది. ఇక్కడి నుంచి కొన్ని సినిమాలు చేసిన ఈ యంగ్ హీరోయిన్ కి లేటెస్ట్ గా చేదు అనుభవం ఎదురైనట్టుగా తన ఎక్స్ పీరియన్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో వారు ఆమె పట్ల చేసి దారుణ ప్రవర్తనతో ఈ యంగ్ హీరోయిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోని ఇండిగో స్టాఫ్ ప్రవర్తన చాలా నీచంగా ఉంటోందని, వీరు రోజురోజుకి అహంకారంతో పెట్రేగిపోతున్నారని చాందినీ చౌదరి అసహనం వ్యక్తం చేసింది.
ఒక సింపుల్ బ్యాగేజ్ విషయంలో వారు గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేసేలా ప్రవర్తిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. ఒక పర్టిక్యులర్ మనిషి అయితే అతని దగ్గర ఐడి కార్డు కూడా లేదు అతని పేరు వివరాలు కూడా చెప్పడానికి ఇష్టపడనివాడు మాపై అరుస్తున్నాడని చాందినీ ఫైర్ అయ్యారు. మేము ప్రశ్నలు అడిగినపుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడని, అతని తర్వాత వచ్చిన మహిళ కూడా అతని పేరు చెప్పేందుకు పాజిటివ్ గా రెస్పాన్స్ కాలేదు అని ఆమె ఆరోపించారు.
ప్యాసింజర్లకి మాత్రం ఎన్నో రూల్స్ ఉంటాయి కానీ, వీరు మాత్రం మేము నెమ్మదిగా డీల్ చెయ్యాలని చూసినా ఈ రకంగా మాట్లాడుతూ నాతో తప్పుగా బిహేవ్ చేస్తారా అంటూ చాందిని చౌదరి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాను అప్పటికే కాలికి గాయంతో బాధపడుతున్నానని ఆమె తెలిపింది, తనతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారని చాందినీ గుర్తుచేసుకున్నారు. చివరికి వారి మీద కూడా ఇండిగో స్టాఫ్ అరుస్తూ గొడవ పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది చాలా దారుణం.. ఖచ్చితంగా మీ కస్టమర్స్ ని ప్రొఫెషనల్ గా డీల్ చెయ్యాలి ఇలా మెంటల్ గా డిస్ట్రబ్ చేసేలా కాదు అంటూ చాందిని చౌదరి తన పోస్ట్ ముగించింది. దీనితో తన పోస్ట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ యంగ్ హీరోయిన్ నుంచి ఈ ఏడాదిలోనే పలు సినిమాలు వచ్చాయి. యేవం , మ్యూజిక్ షాప్ మూర్తి అనే రెండు సినిమాలు ఈ ఏడాది లోనే అది కూడా ఒకే రోజు రిలీజ్ కి రావడం విశేషం. ఇక ఇవి పక్కన పెడితే తెలుగులో పెద్దగా ఎలాంటి ఆఫర్స్ లేనట్టు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











