Don't Miss!
- Finance
Google: ఉద్యోగుల తొలగింపు తర్వాత గూగుల్ మరో అడుగు.. ఏంటిది సుందర్ పిచాయ్..!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
చావు బతుకుల్లో టాలీవుడ్ సినీ రచయిత కందికొండ.. హాస్పిటల్‌లో సాయం కోసం ఎదురుచూపు
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది టాలెంట్ ఉన్న యువ నటీనటులను, యువ దర్శకులను కోల్పోయింది. కరోనా కారణంగా కొంత మంది చనిపోతే అనూహ్యంగా గుండెపోటు రావడంతో మరి కొందరు మరణించారు. అయితే తాజాగా ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ గిరి ప్రస్తుతం త్రోట్ కాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో గత కొద్ది రోజులుగా ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ బోనాల పాట, సమ్మక్క సారక్క పాట, కాళేశ్వరం, దీపావళి సంక్రాంతి ఇలా ఎన్నో తెలంగాణ యాసలో సాగే పాటలు రాసిన ఆయన సినిమాలకు కూడా చాలా పాటలు రాశారు. దేశముదురు, పోకిరి, మున్నా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాంటి ఎన్నో సినిమాల్లో ఆయన దాదాపు పన్నెండు వందల పాటలు రాసినట్లు తెలుస్తోంది. గత 15 రోజుల నుంచి అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయనకు వైద్యం నిమిత్తం చాలా ఖర్చు అయినట్లు చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అంటున్నారు. ఒక రోజుకు వెంటిలేటర్ చార్జస్ మాత్రమే దాదాపు 70 వేల రూపాయలు అవుతున్నాయి అని అంటున్నారు. ఆ చార్జీలకు తగ్గట్టు మెడిసిన్ ఇతర ఛార్జీలు వేరే గా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సన్నిహితులు, స్నేహితులు అందరూ కలిసి ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నారు. అలాగే సహాయం చేయగిలిగిన ఎవరినా సాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇక ఈ విషయం సినీ పెద్దల దృష్టికి వెళ్తే వాళ్ళు ఏమైనా సహాయం చేసే అవకాశం ఉంది. ఆయన చివరిగా నీదీ నాదీ ఓకే కధ సినిమా కోసం రెండు పాటలు రాశారు.
తీవ్ర అస్వస్థతకు గురైన కందికొండకు దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకొంటే.. అతడి భార్య కందికొండ రమాదేవి గూగుల్ పే & ఫోన్ పే నెంబర్ 8179310687 తమకు తోచిన విధంగా సాయం చేయవచ్చు.