twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    DJ టిల్లు ఓటీటీ రిలీజ్ డేర్ ఫిక్స్.. జెట్ స్పీడ్ లో వచ్చేస్తోందిగా.. ఎక్కడంటే?

    |

    ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలని చూసిన సినిమాలో DJ టిల్లు కూడా ఉంది. అయితే అప్పుడు దిల్ రాజు ఇంటి నుంచి ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతూ వచ్చిన రౌడి బాయ్స్ సినిమా కోసం తప్పుకోక తప్పలేదు. డీజే టిల్లు సినిమా మొత్తానికి ఫిబ్రవరి 12వ తేదీన వాలెంటైన్స్ డే హడావిడిలో భారీ స్థాయిలో విడుదల అయింది ఎక్కువగా యూత్ ను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఇక ప్రమోషన్స్ కూడా సినిమాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి అనే చెప్పాలి. మధ్యలో వచ్చిన కొన్ని కాంట్రవర్సీలు కూడా సినిమాకు సోషల్ మీడియాలో పేరును బాగా హైలెట్ చేసింది. మొత్తానికి విడుదల అనంతరం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.

    సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. వీరి కెమిస్ట్రీ కి మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి. అంతేకాకుండా విడుదలకు ముందు టైటిల్ సాంగ్ కూడా కావలసినంత ప్రమోషన్స్ ను క్రియేట్ చేసింది. ఎక్కువగా సోషల్ మీడియాలో డీజే టిల్లు పాట మారుమ్రోగిపోయింది. ఇక విడుదల తరువాత వారం రోజుల పాటు సినిమాకు ఎదురు లేకుండా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. పోటీగా రవితేజ సినిమా ఒక రోజు ముందుగానే వచ్చినప్పటికీ ఆ సినిమా ప్రభావం పెద్దగా కనిపించలేదు.

    Telugu movie DJ tillu ott digital aha streaming date fix

    పైగా ఖిలాడి సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో డీజే టిల్లు సినిమాకు బాగా ప్లస్సయింది. ఇప్పుడున్న సినిమాలలో ఇదే బెస్ట్ సినిమా అని అందరూ డీజే తెలుగు సినిమా కి వెళ్ళడం మొదలు పెట్టారు. మొదటి సినిమా చాలావరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనమిచ్చింది. అంతేకాకుండా ఓవర్సీస్లో కూడా ఈజీగా ఆఫ్ మిలియన్ డాలర్స్ ను అందుకని టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు అక్కడ కూడా మంచి స్టార్ట్ అయితే ఇచ్చింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు కూడా ఈ చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు. ఇక మార్చి 4వ తేదీన డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నట్లు సమాచారం.

    ఈ సినిమా హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాన్ థియేట్రికల్ గా కూడా డీజే టిల్లు సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. సినిమాను హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్లో నాగవంశి నిర్మించాడు. అదే ప్రొడక్షన్ లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకున్న విషయం తెలిసిందే. సీతారా బ్యానర్ లో నాగవంశీ బిర్మాతగా వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో సితార ఎంటర్టైన్మెంట్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. మరి రానున్న సినిమాలు ఇంకా ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

    English summary
    Telugu movie DJ tillu ott digital aha streaming date fix,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X