twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్ డౌన్ తరువాత మళ్ళీ సినిమాల సందడి.. జూలై 30న రాబోతున్నా 5 సినిమాలు..

    |

    సినిమా ప్రపంచాన్ని కరోనా వైరస్ భారీ దెబ్బ కొట్టింది. దాదాపు సంవత్సరంన్నర సమయాన్ని వృధా చేసింది. ఈ రేంజ్ లో షాక్ తగులుతుందని ఎవరు ఊహించలేదు. ఇక మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు అందుతున్న సమయంలో థియేటర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. ఈ నెల 30 నుంచి కొన్ని సినిమాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇక అందులో రెండే రెండు సినిమాలు కాస్త హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

    థియేటర్స్ వరకు రప్పించగలరా?

    థియేటర్స్ వరకు రప్పించగలరా?

    కరోనా భయం అయితే తగ్గినట్లు బయట జనాలను చూస్తేనే అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలు థియేటర్స్ వరకు వాళ్ళను రప్పించగలవా లేవా అనేది అసలు ప్రశ్న. పెద్ద సినిమాలు వస్తేనే జనాలు అంత ఈజీగా పట్టించుకోవడం లేదు. ఇక చిన్న సినిమాల పరిస్థితి చాలా వరకు అనుమానంగానే ఉంది. కానీ ధైర్యం చేసి 5 సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.

    ఆ మూడు సినిమాలు..?

    ఆ మూడు సినిమాలు..?

    ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాయో తెలియదు గాని పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేని మూడు చిన్న సినిమాలు తక్కువ స్క్రీన్స్ లలో రిలీజ్ అవుతున్నాయి. నరసింహపురం, త్రయం, పరిగెత్తు పరిగెత్తు అనే సినిమాల్లో నటీనటులు కూడా జనాలకు పెద్దగా తెలియదు. కానీ థియేటర్స్ ను నడిపిస్తున్నారు కాబట్టి షోలు వేయక తప్పడం లేదట. మరి ఈ సినిమాలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

    తేజ సజ్జ.. ఇష్క్

    తేజ సజ్జ.. ఇష్క్

    ఇక ప్రమోషన్ తో ఆ మధ్య బాగా హైప్ క్రియేట్ చేసిన తేజ సజ్జ ఇష్క్ సినిమా మొత్తానికి జూలై 30న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. థ్రిల్లర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సింది. ఇక కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడు ఫ్రెష్ గా ఎట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

    సత్యదేవ్.. తిమ్మరుసు

    సత్యదేవ్.. తిమ్మరుసు

    ప్రయోగాత్మకమైన సినిమాలతో ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే సత్యదేవ్ ఈసారి తిమ్మరుసు అనే సినిమాతో రాబోతున్నాడు. ఎన్టీఆర్ చేతులమీదుగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 30న కాస్త ఎక్కివగా క్రేజ్ అందుకునే సినిమా అవుతుందని చెప్పవచ్చు. మరి జనాలు ఎంతవరకు ఎట్రాక్ట్ అవుతారో చూడాలి.

    English summary
    The corona virus has hit the movie world hard. Wasted almost a year and a half. Who would have guessed that the shock would hit in this range. Theaters, on the other hand, reopened when third-wave warnings were received. From the 30th of this month some movies are ready to test their luck. The second two films are trying to create some hype.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X