బ్రేకింగ్: రెండో పెళ్లికి సిద్ధమైన సింగర్ సునీత.. ఆ వ్యక్తితో ఎంగేజ్మెంట్ పూర్తి.. ఫొటోస్ వైరల్
టాలీవుడ్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్స్ లో ఒకరైన సునీత ఫైనల్ గా రెండో వివాహానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా సునీత వివాహంపై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. రూమర్స్ వస్తే వెంటనే క్లారిటీ ఇచ్చే ఆమె ఇటీవల కాలంలో కథనాలు ఎన్ని వచ్చినా కూడా పెద్దగా స్పందించలేదు. ఇక అనుకున్నట్టుగానే ఊహాగానాలు నిజమయినట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఒక మీడియా హౌజ్ ఛైర్మన్ ని పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

19 ఏళ్ళ వయసులోనే మొదటి వివాహం
సింగర్ సునీతకు 19ఏళ్ల వయసులోనే మీడియాలో వర్క్ చేసే ఒక వ్యక్తితో పెళ్లి జరిగింది. వారికి కొడుకు, కూతురు కూడా జన్మించారు. అయితే కొన్నేళ్ల తరువాత మనస్పర్థల కారణంగా చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. సునీత వద్దనే పిల్లలు టీనేజ్ వయసును దాటి వచ్చేశారు. కూతురు సింగర్ గా కూడా కొనసాగుతోంది. ఇక గతంలో ఆమె పెళ్లిపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోలేదు.

అప్పట్లో ఒక క్లారిటీ ఇచ్చిన సునీత
రెండుమూడు సార్లు రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని కూడా కౌంటర్స్ ఇచ్చింది. ఇక రెండో పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు సునీత చాలా సార్లు పాజిటివ్ గానే స్పందించారు. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదు. నా జీవితంలో ఎలాంటి విషయమైనా సరే నేను నిర్ణయం తీసుకున్న తరువాతే క్లారిటీ ఇస్తాను. అప్పటివరకు ఎలాంటి రూమర్స్ నమ్మవద్దని ఒకసారి లైవ్ లోనే క్లారిటీ ఇచ్చారు.

సోమవారం నిశ్చితార్థం చేసుకున్న సునీత
ఇక అర్థం చేసుకునే మంచి వ్యక్తి దొరకడంతో ఆమె ఇటీవల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ ని మెయింటైన్ చేసే మీడియా ఛైర్మన్ తో నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video

క్లారిటీ ఇవ్వనున్న సునీత..?
ఇక సునీత పెళ్లిపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లని తెలుస్తోంది. అతను కూడా విడాకులు తీసుకొని గత కొంత కాలంగా ఒంటరిగానే ఉంటున్నట్లు సమాచారం. ఇక ఈ ఉదయం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లిపై కూడా సునీత త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











