twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన భాషను కాపాడే లక్ష్యంతో... ‘ఒక తెలుగు ప్రేమకథ ’

    |

    ఇప్పుడున్న యువతకు, పిల్లలకు తెలుగు సరిగ్గ రావడం లేదు. వారంతా ఆంగ్లం మీద మోజుతో తల్లి లాంటి తెలుగును మర్చిపోతున్నారు. ఇది ఇలా కొనసాగితే ఎదో రోజు తెలుగు భాష అంతరించిపోవచ్చు. ఇలా జరుగకుండా ఉండటమే లక్ష్యంతో... మన భాషను మనమే కాపాడుకోవాలనే ఇద్దరు యువతీయువకులు తెలుగు భాష కోసం ఏం చేసారనే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం ''ఒక తెలుగు ప్రేమకథ''. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కె.ఎస్.రవికుమార్ (జై ప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మహబూబ్ నగర్), నంది అవార్డ్ గ్రహీత ఆచార్య చక్రవర్తి సమేత గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

    ఈ సందర్బంగా కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ... ఈ సినిమా ప్రివ్యూ చూసాను. తెలుగు భాష గురించి ఈ చిత్రంలో చాలా గొప్పగా చూపించడం జరిగింది. మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగింది. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆధారిస్తారని అనుకుంటున్నాను అన్నారు.

    ఆచార్య చక్రవర్తి సమేత గాంధీ మాట్లాడుతూ... నేను గతంలో చాలా చిత్రాల్లో నటించాను. ఈ సినిమాలో మరో మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నాకు ఈ రోల్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా చూసాను. విమర్శకుల ప్రసంశలు పొందుతుందని నమ్ముతున్నాను అన్నారు.

    Telugu Prema katha trailer launched

    ఈ సందర్బంగా నిర్మాత కె.బసిరెడ్డి మాట్లాడుతూ... తెలుగు భాష, సంస్కృతిని మరిచిపోతున్న ఈ తరుణంలో తెలుగు భాష అభ్యున్నతి కోసం హీరో, హీరోయిన్ ఏం చేశారనే ఆసక్తికరమైన పాయింట్ తో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ప్రాన్స్ వాడు ప్రాన్స్ ను లైక్ చేస్తున్నాడు. గుజరాతి వాడు గుజారాతిలోనే మాట్లాడున్నాడు. కానీ మన ఇండియాలో తెలుగు వారు మాత్రం ఇంగ్లీష్ ను ఎక్కువగా వాడుతున్నాడు. ఈ సంస్కృతి అంతరించారని ఈ సినిమాను చెయ్యడం జరిగింది అన్నారు.

    దర్శకుడు బి.సంతోష్ కృష్ణ మాట్లాడుతూ... నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత బసిరెడ్డి గారికి , పి. ఎల్.కె.రెడ్డి గారికి ధన్యవాదాలు. తెలుగు భాష గొప్పదనం గురించి ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం ఈ సినిమా. నటీనటులు అందరూ బాగా చేశారు. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను అన్నారు.

    పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ... ఒక తెలుగు ప్రేమ కథ సినిమాకు నేను భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత బసిరెడ్డి టేస్ట్ ఉన్న నిర్మాత, దర్శకుడు సంతోష్ కృష్ణ సినిమాను బాగా తీసాడు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్మకం ఉంది అన్నారు

    హీరో మహేంద్ర మాట్లాడుతూ... దర్శకుడు సంతోష్ ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకొని సినిమాను తీశారు. నిర్మాత బసిరెడ్డి గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను నిర్మించారు. ఈ సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ కష్టపడి వర్క్ చేశారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది అన్నారు.

    హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ... ముందుగా నాకు ఈ సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత బసిరెడ్డి గారికి ధన్యవాదాలు. మంచి సినిమాను ప్రేక్షకుకు ఎప్పుడూ ఆధారిస్తూ వస్తున్నారు బీ సినిమాతో కథ కథనాలు బాగుంటాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

    తారాగణం:
    మహేంద్ర, లావణ్య, సమ్మోట గాంధీ, భవాని శంకర్, సాకేత్ మాధవి, బేబీ కీర్తన, కృష్ణ మూర్తి

    నిర్మాణం: డిజిక్విస్ట్ ఇండియా లిమిటెడ్
    నిర్మాత: కె.బసిరెడ్డి
    దర్శకత్వం: బి.సంతోష్ కృష్ణ
    కెమెరామెన్: దేవేందర్ రెడ్డి
    సంగీతం: మహిత్ నారాయణ్
    నిర్మాణ సారధి: పి.ఎల్.కె.రెడ్డి
    ఎడిటర్: కృష్ణ పుత్ర (జై) రాఘవేందర్ రెడ్డి
    నృత్యం: రాజ్ పైడి
    శబ్దగ్రాహకులు: డి.వెంకట్రావు, సురేష్.ఎమ్
    పి.ఆర్.ఓ: మధు వి.ఆర్

    English summary
    A film is coming soon to protect our Telugu language. The titled as 'Telugu Prema katha' . Mahendra, Lavanya, Sammota Gandhi, Bhavani Shankar, Saket Madhavi, Baby Kirtan and Krishna Murthy are the main cast. B Santosh Krishna is directing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X