గామి, భీమా, ప్రేమలు.. థియేటర్ల వద్ద దేని సౌండ్ ఎక్కువగా ఉందో తెలుసా?
మార్చి నెలలో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈనెల 8వ తేదీ రోజు మూడు సూపర్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈక్రమలోనే సినీ ప్రియులు అందరూ తమకు నచ్చిన చిత్రాలు చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. తమ అభిమాన హీరో, లేకపోతే పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను ఫ్యామిలీతో కలిసి వీక్షించేందుకు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో.. అంటే మార్చి 12వ తేదీ ఉదయం నుంచి జనవరి 13వ తేదీ ఉదయం వరకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి.. ఏ సినిమాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గడిచిన 24 గంటల్లలో బుక్ మై షోలో ఎక్కువగా బుక్ అయిన టికెట్లు, ఏయే సినిమాల టికెట్లు అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మలయాళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా ప్రేమలు. ఈ సినిమా ముందుగా అక్కడ రాగా.. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేసింది. సినిమా బాగుండడంతో.. ఎక్కువ మంది ఆ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చడంతో... తెలుగులో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేశారు. అలా ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకు వచ్చి.. మార్చి 8వ తేదీన గ్రాండ్ గా విడుదల చేశారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు, రాజమౌళి వంటి స్టార్ లు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రీవ్యూలు ఇచ్చారు. దీంతో ఈ సినిమాను చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఒక్క బుక్ మై షో ద్వారానే గడిచిన 24 గంటల్లో 8.7k టికెట్లు అమ్ముడు పోయాయి. అంటే 8 వేల 700 మంది ప్రేమలు సినిమా చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా టాప్ లో ప్రేమలు నిలిచింది.
ఇక రెండో స్థానంలో విశ్వక్ సేన్ హీరోగా చేసిన గామి సినిమా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు 6.4కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. 6 వేల 400 మంది బుక్ మై షో ద్వారా ఈ సినిమాను చూడనున్నారు. విశ్వక్ సేన్ హీరోగా.. విద్యాధర్ కాగిత డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. అలాగే విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

ఇక మూడో స్థానంలో గోపీచంద్ హీరోగా చేసిన భీమా సినిమా నిలిచింది. ముఖ్యంగా 6.1కే మంది ఈ చిత్రాన్ని చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. 6 వేల 100 మంది బుక్ మై షో ద్వారా ఈ సినిమాను చూస్తున్నారు. భీమా సినిమాకు ఎ హర్ష దర్శకత్వం వహించగా.. కెకె రాధామోహన్ నిర్మించారు. గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటించారు. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘు బాబు, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర, నిహారిక కొణిదెల, రోహిణిలు ప్రధాన పాత్రల్లో కనిపించారు.


Click it and Unblock the Notifications











