Premalu: ప్రేమలు సినిమాకు పెరుగుతున్న క్రేజ్.. ఇప్పటి వరకు ఎంత మంది ఈ సినిమా చూశారంటే?

అద్భుతమైన ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఎక్కువే. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చి అందిరనీ ఎమోషనల్ గా టచ్ చేసే ప్రతీ చిత్రం సూపర్ హిట్ గా నిలుస్తుంటుంది. భాషతో సంబంధం లేకుండా సెన్సేషన్ క్రియేట్ చేసే ఇలాంటి చిత్రాలను అన్ని భాషల్లోకి డబ్ చేస్తుంటారు. అలా తెలుగులోకి వచ్చిన చిత్రమే ప్రేమలు. మలయాళంలో ముందుగా వచ్చిన ఈ సినిమా తెలుగులోకి కూడా డబ్ కాగా మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.

అయితే సూపర్ హిట్ దిశగా దూసుకు వెళ్తున్న ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు చాలా మందే చూశారు. ముఖ్యంగా బుక్ మై షోలో గామి, భీమాలకంటే ఎక్కువగా ఈ సినిమా టికెట్లే అమ్ముడు పోతున్నాయి. అయితే 9 రోజుల నుంచి ఏరోజు ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయి, ఇప్పటి వరకు ఎంత మంది ఈ సినిమాను చూశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Premalu Movie Total 9 Days Tickets Sold List is Here Check Details

గిరీష్ ఏడీ దర్శకత్వంలో నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమానే ప్రేమలు. ఈ సినిమాను భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం అందించారు. ముందుగా మలయాళంలో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందీ చిత్రం.

అలా ఈ సినిమాను చూసిన రాజమౌళి కొడుకు కార్తికేయ్ ఈ చిత్రం హక్కులను కొని తెలుగులో విడుదల చేశాడు. మార్చి 8వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రానికి బాగానే రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ రాగా.. రోజురోజుకూ క్రేజ్ ఎక్కువ అవుతోంది. అయితే 9 రోజుల్లో లక్షన్నరకు పైగా మంది ఈ సినిమాను చూశారు. ఇది కేవలం బుక్ మై షో లిస్టు మాత్రమే. ఇక వేరే సైట్ల నుంచి నేరుగా థియేటర్లకు వెళ్లి చూసిన వారి సంఖ్య మరింత ఎక్కువే.

Telugu Premalu Movie Total 9 Days Tickets Sold List is Here Check Details

ఈ సినిమాకు మొదటి రోజు అంటే మార్చి 8వ తేదీ రోజు బుక్ మై షోలో మొత్తం.. 10.58కే అంటే 10 వేల 580 టికెట్లు అమ్ముడు పోయాయి. అలాగే రెండో రోజు 17.78కే అంటే 17 వేల 780, మూడో రుజో 19.06కే అంటే 19 వేల 60, నాలుగో రోజు 8.80కే అంటే 8 వేల 800, ఇక ఐదో రోజు 8.64కే అంటే 8 వేల 640, ఆరో రోజు 11.37కే అంటే 11 వేల 370 టికెట్లు బుక్ అయ్యాయి.

అలాగే ఏడో రోజున 13.44 అంటే 13 వేల 440, ఎనిమిదో రోజున 20.20కే అంటే 20 వేల 200, తొమ్మిదో రోజున 34.8కే అంటే 34 వేల 80 టికెట్లు బుక్ అయి.. ఇలా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముందు ముందు మరింత క్రేజ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X