AP Elections 2024: ఎన్నికల కౌటింగ్ ఎఫెక్ట్: అపోలో చేరిన బండ్ల గణేష్.. పరిస్థితి ఎలా ఉందంటే?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర అనారోగ్యంతో హస్పిటల్‌లో చేరడం సినీ ప్రముఖులను, అభిమానులను ఆందోళన గురవుతున్నారు. ఉదయం నుంచి ఆయనకు శ్వాస సంబంధిత, ఇతర సమస్యలు తలెత్తడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాల్లోకి వెళితే..

బండ్ల గణేష్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరడంపై తన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. హాస్పిటల్‌లో ఆయన చేరిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో ఆయన తన ఛాతీని నొక్కుకుంటూ కనిపించగా.. వైద్యులు ఆయన చికిత్స కొనసాగిస్తూ కనిపించారు.

Telugu Producer Bandla Ganesh joined in Apollo Hospital before Andhra Election Results 2024

అయితే ఆ వీడియోలో చూస్తే.. ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందనే ఫీలింగ్ కలిగింది. అయితే ఆయనకు ఛాతీలో నొప్పి, అసౌకర్యంగా ఉండటంతో వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు అని సన్నిహితులు తెలిపారు.

అయితే ఎన్నికల ఫలితాలకు ముందు బండ్ల గణేష్ ఒత్తిడికి గురై ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆంధ్రాలో ఆయన తెలుగుదేశం కూటమికి సపోర్ట్ చేస్తుండటం తెలిసిందే. ఇక తెలంగాణలో ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానిగా ఉండటం కొత్తగా చెప్పాల్సిన విషయం కాదనేది గమనార్హం.

ప్రస్తుతం బండ్ల గణేష్‌ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాం. కొంత ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. రేపటిలోగా ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X