జానీ మాస్టర్ వెనుక భారీ కుట్ర.. యాంకర్ ఝాన్సీ చెప్పిన వారే.. బాంబు పేల్చిన నిర్మాత

లైంగిక వేధింపులు, మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్టోబర్ 8వ తేదీన జాతీయ అవార్డుల ప్రధానం కార్యక్రమంలో ఉత్తమ కోరియోగ్రాఫర్ అవార్డు అందుకోవడానికి బెయిల్ మంజూరు అయింది. అయితే అనూహ్యంగా ఆయనకు ఇచ్చే అవార్డును రద్దు చేశామని కమిటీ వెల్లడించింది. అయితే అవార్డు రద్దు వెనుక భారీ కుట్ర జరిగిందని నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..

జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు 2022 సంవత్సరంలో వచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరికీ రాలేదు. పేదరికం నుంచి తన ప్రతిభతో జాతీయ స్థాయి వరకు ఎదిగాడు. ఆయనపై లైంగిక దాడి కేసు ఉంది. గత 5 ఏళ్లలో ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే.. ఈ కేసులో ఆయన జాతీయ అవార్డు అందుకొనేందుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ కొంత మంది గిట్టని వాళ్లు డ్రామా ప్లే చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లే.. నేషనల్ కమిటీకి మెయిల్ పెట్టారు అని నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Producer Natti Kumar alleges Industry bigwigs Conspiracy behind Jani Master Award Cancel

జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలు నుంచి ఫిర్యాదు ఏమీ లేదు. నా కెరీర్ నేను కొనసాగించుకొంటాను. నాకు రక్షణ ఇవ్వండి అని చెబుతున్నారు. బాధితురాలు అవార్డులు క్యాన్సిల్ చేయమని చెప్పడం లేదు. ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని జానీ మాస్టర్‌ను దెబ్బ కొట్టాలని ఇండస్ట్రీలోని కొందరు భారీ కుట్రను పన్నుతున్నారు. త్వరలోనే అన్ని బయటపెడుతాం. నేనే స్వయంగా బయటపెడుతాను అని నట్టి కుమార్ అన్నారు.

జాతీయ అవార్డు రద్దు చేసిన తర్వాత స్వయంగా జానీ మాస్టర్ తన బెయిల్ రద్దు చేయమని కోర్టులో పిటిషన్ వేశారు. కానీ అంతుకుముందే కొందరు బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఉత్సాహం చూపారు. నేషనల్ కమిటీకి అవార్డు రద్దు చేయాలని లేఖలు రాశారు. అంతకు ముందే నేను బెయిల్ క్యాన్సిల్ చేసుకోవడం అత్యుత్సాహం కాదు అని అన్నారు.

Telugu Producer Natti Kumar alleges Industry bigwigs Conspiracy behind Jani Master Award Cancel

జానీ మాస్టర్‌కు ఓ కొత్త కోణంలో భారీగా ఏదో జరుగుతున్నది. ఫిలిం చాంబర్ పెట్టిన మీటింగ్‌లో యాంకర్ ఝాన్సీ చెప్పినట్టే జరుగుతున్నది. ఝాన్సీ గారు ఏవైతే పేర్లు చెప్పారో వాళ్లే ఉన్నారు. నేషనల్ కమిటీకి మెయిల్ రాసిందెవరు? ఇండస్ట్రీకి ఇలాంటి పనులు మంచివి కాదు. ఈ రోజు జానీ మాస్టర్‌కు జరిగింది. మరో రోజు మరొకరికి జరుగొచ్చు. అది ఏ మాత్రం సరికాదు అని నట్టి కుమార్ అన్నారు.

జానీ మాస్టర్ కేసులో చాలా జరుగుతున్నాయి. కోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకూడదు. ఫేక్ సర్టిఫికెట్ల గురించి..త్వరలోనే మొత్తం బయటపడుతుంది. అవార్డు రద్దు చేయడానికి ఛాంబర్‌లోని కొందరు వ్యక్తులు, ఇండస్ట్రీ పెద్దలు అతడిపై దెబ్బ కొట్టారు. అవార్డును ఆపిన వాడు ఓడారు. జైల్లో ఉండి ఆయన తన ప్రతిభ ద్వారా గెలుచుకొని.. కొందరికి చెంప దెబ్బ కొట్టారు. ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు సంచలనం సృష్టిస్తాయి అని నట్టి కుమార్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X