సినీ యువ నిర్మాతతో బాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ కిడంబి ఎంగేజ్‌మెంట్..పెళ్లి ఎప్పుడంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో మరో పెళ్లి వార్త బ్రేకింగ్‌గా మారింది. అయితే ఈ సారి సినిమా రంగం, క్రీడా రంగానికి చెందిన ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే వారిద్దరూ సోషల్ మీడియాలో తమ పెళ్లి ప్రకటనను అధికారికంగా ప్రకటించారు. ఆ ఇద్దరు సెలబ్రిటీలు గురించిన వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాలంలో బాడ్మింటన్ క్రీడారంగంలో అద్బుతంగా రాణిస్తున్న ఆటగాడు శ్రీకాంత్ కిడంబి. ప్రపంచ ర్యాకింగ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా సొంతం చేసుకొన్నాడు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. యువ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ప్రపంచ బాడ్మింటన్ రంగంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.

ఇక గత కొద్దికాలంలో శ్రీకాంత్ కిడంబి తన స్నేహితురాలైన శ్రావ్య వర్మతో డేటింగ్ చేస్తున్నారు. శ్రావ్య వర్మ తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టూమ్ డిజైనర్‌గా మంచి పేరు సంపాదించుకొన్నది.ఇటీవల ఆమె నిర్మాతగా కూడా మారి సినిమాను నిర్మించింది. వీరిద్దరూ కొంత కాలంగా ట్రావెల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
తమ పెళ్లి విషయాన్ని ప్రపంచంతో పంచుకోవాలని నిర్ణయించుకొన్న శ్రీకాంత్, శ్రావ్య వర్మ సోషల్ మీడియా ద్వారా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆమె నా ప్రపొజల్‌కు ఎస్ చెప్పింది.దాంతో మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం అని ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు వైరల్ అయింది. దాంతో ఈ ఇద్దరి కలయిక సినిమా, క్రీడలు,ఫ్యాషన్ రంగాన్ని మరింత దగ్గర చేస్తుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
శ్రావ్య వర్మ విషయానికి వస్తే..తెలుగులో మ్యాస్ట్రో, టాక్సీవాలా, దేవదాస్, చిలసౌ, కిల్లింగ్ వీరప్పన్, పొటుగాడు సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇటీవల గుడ్ లక్ సఖి అనే సినిమాతో నిర్మాతగా మారారు.త్వరలోనే శ్రీకాంత్ కిడింబికి సతీమణి రోల్‌ను పోషించబోతున్నారు.


Click it and Unblock the Notifications











