Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువ నటుడు మృతి!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని వరుస విషాదాలు సినీ ప్రముఖులను ఆశ్చర్యాన్ని కలోగిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు అనారోగ్య కారణాలతో కొంతమంది సెలబ్రిటీలు మరణించారు. అయితే ఇప్పుడు మాత్రం ఒక యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు హఠాత్తుగా తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కలచివేసింది.
ప్రస్తుతం అతనికి సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక నటుడిమృతిపై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ యాక్టర్ కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు ఇక సూసైడ్ చేసుకున్న యువకుడి వివరాల్లోకి వెళితే.
ఇటీవల కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్ ఎట్ ఆలేరు.. అనే సినిమాల ద్వారా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సుధీర్ వర్మ మళ్ళీ మరికొన్ని సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఒక చిన్న సినిమా షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అతను హఠాత్తుగా విశాఖపట్నంలో సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు రావడంతో అందరిని ఒక్కసారిగా షాక్ గు గురిచేసింది. నిన్న మొన్నటి వరకు నవ్వుతూ కనిపించిన సుధీర్ వర్మ ఎందుకు హఠాత్తుగా ప్రాణాలు తీసుకున్నాడు అనేది అందరిలో మెదులుతున్న అతిపెద్ద సందేహం. అయితే అతనితో కలిసి కుందనపు బొమ్మ అనే సీరియల్ లో నటించిన నటుడు సుధాకర్ కోమకుల సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశాడు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా క్రేజ్ అందుకున్న సుధాకర్ ఆ తర్వాత సుధీర్ వర్మతో కుందనపు బొమ్మ అనే సినిమా చేశాడు. ఆ సినిమాతోనే ఈ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారారు. అయితే సుధీర్ వర్మ మృతి చెందడంతో ఆయన వెంటనే సోషల్ మీడియాలో ఈ విధంగా వివరణ ఇచ్చాడు.
అతను ఎంతో ఇష్టమైన వ్యక్తి అని అతనితో కలిసి ఉన్నన్ని రోజులు కూడా ప్రయాణం చాలా హ్యాపీగా కొనసాగింది అని చెప్పాడు. అంతేకాకుండా నువ్వు లేని ఈ జీవితం జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని సుధాకర్ ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చాడు. అయితే సుధీర్ ఎందుకు చనిపోయాడు అనే విషయం పై మాత్రం ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.