టెంపర్, రక్త చరిత్ర నటుడి అరెస్ట్.. భారీగా డ్రగ్స్ లభ్యం..
నిషేధిత మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలపై నటుడు ఎజాజ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత రాత్రి ముంబై పోలీసు విభాగానికి చెందిన నార్కొటిక్ విభాగం అధికారులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. తదుపరి సమాచారం కోసం విచారిస్తున్నారు. ఎజాజ్ ఖాన్ అరెస్ట్‌తో డ్రగ్స్ దందా మరోసారి హైలెట్ అయ్యే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

ముంబైలో ఎజాజ్ అరెస్ట్
నటుడు ఎజాజ్ ఖాన్‌ను బేలపూర్‌లోని హోటల్‌లో అరెస్ట్ చేశాం. అతని వద్ద నిషేధిత డ్రగ్స్ దొరికాయి. 8 ఎక్టసీ ట్యాబెట్లతో కూడిన డ్రగ్స్ లభించాయి. దాంతో ఆయనను అరెస్ట్ చేశాం. మంగళవారం అతడిని కోర్టులో ప్రవేశపెడుతాం అని జాతీయ వార్తా సంస్థకు ముంబై పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ మత్తులో ఉండగా
ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో పూర్తిగా డ్రగ్స్ మత్తులో ఉన్నాడు. పోలీసులు వచ్చారనే విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేడు. అతడి వద్ద ఉన్న రెండు ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

సినీ ప్రముఖులతో సంబంధాలు
ఎజాజ్ ఖాన్‌కు సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అతడిని విచారిస్తే మరికొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఎజాజ్ అరెస్ట్ కావడం తొలిసారి కాదు..
ఎజాజ్ ఖాన్ అరెస్ట్ కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై 2017లో పోలీసులు సోదాలు చేసి అరెస్ట్ చేశారు. అలాగే హెయిర్ స్టయిలిస్ట్‌కు అసభ్య చిత్రాలు పంపారని ఫిర్యాదు చేయడంతో వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎజాజ్ ఖాన్ నటించిన చిత్రాలు ఇవే
ఎజాజ్ ఖాన్ బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొన్నాడు. తెలుగులో రక్త చరిత్ర, టెంపర్, వేట, హార్ట్ ఎటాక్, బాద్షా, నాయక్, దూకుడు తదితర చిత్రాల్లో నటించాడు. తెలుగులో రోగ్ అనే చిత్రంలో చివరిసారిగా కనిపించాడు. పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











