‘టెంపర్’ విలన్ అరెస్ట్.. అప్పుడు డ్రగ్స్‌తో.. ఇప్పుడు..
దూకుడు చిత్రంలో బంటి పాత్రతో విలన్‌గా పరిచయమైన ఎజాజ్ ఖాన్‌ను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టారనే ఆరోపణలపై ఎజాజ్ ఖాన్‌ను శనివారం అదుపులోకి తీసుకొన్నారు. ఫేస్‌బుక్ లైవ్‌లో అభ్యంతరకరంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆయనపై ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ కేసులో దర్యాప్తు జరిపిన అనంతరం ఎజాజ్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందనే విషయం రుజువైంది. దాంతో ఆయనకు సమన్లు పంపి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోరాం అని పోలీసుల తెలిపారు.

ఫేస్‌బుక్ లైవ్‌లో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంపై ఆయనపై ఐపీసీ సెక్షన్ 135ఏ కింద కేసు నమోదైంది. కమ్యూనిటీల మధ్య విభేదాలు, శతృత్వం పెంచేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై కేసు నమోదైంది అని పోలీసులు పేర్కొన్నారు.
గతంలో కూడా ఎజాజ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. అభ్యంతరకరమైన వీడియోను పోస్టు చేశారనే కారణంతో ఆయనను జూలై 2019లో అరెస్ట్ చేశారు. అలాగే అక్టోబర్ 2018లో కూడా నిషేధిత డ్రగ్స్‌తో పట్టుబడటంతో మరోసారి అరెస్ట్ అయ్యారు.
తెలుగులో నాయక్, బాద్షా, హార్ట్ ఎటాక్, టెంపర్, రోగ్ చిత్రాల్లో నటించారు. హిందీలో పూరీ జగన్నాథ్ రూపొందించిన బుడ్డా హోగా తెరా బాప్ చిత్రంలో కూడా నటించారు.


Click it and Unblock the Notifications











