Tempt రాజ.. పక్కా యూత్, పూర్తిస్థాయి అడల్డ్ కంటెంట్‌తో...

అర్జున్ రెడ్డి, RX100 లాంటి చిత్రాలకు విశేషంగా ప్రేక్షకుల ఆదరణ దక్కడంతో అలాంటి కథ, కథనాలతో యూత్‌ను ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలు జరిగాయి. అలాంటి చిత్రాల స్పూర్తితో పక్కాగా యూత్ అండ్ అడల్డ్ కంటెంట్‌తో రూపొందిన చిత్రం Tempt రాజా. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తున్నది.

ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకీ (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ.. Tempt రాజా మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా రూపొందింది.

Tempt Raja adult comedy movie teaser goes viral

అడల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా యూత్‌ని బాగా అలరిస్తుంది. గతంలో మేము విడుదల చేసిన సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదల చేసిన టీజర్‌కి ఇంకా బాగా రెస్పాన్స్ వస్తున్నది. టీజర్‌ను చూసిన ట్రేడ్ వర్గాలు బిజినెస్‌పై ఆసక్తిని చూపిస్తున్నారు. 10 రోజుల్లో మా సినిమా బిజినెస్‌ని క్లోజ్ చేసేలా మూవీ టీజర్ ప్రభావం చూపింది. బయ్యర్స్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

హీరోయిన్లు దివ్య రావ్, ఆస్మ చాలా బాగా నటించారు. ఫస్ట్ టైం నటిస్తున్నామనే ఫీలింగ్ లేకుండా సహజంగా నటించారు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇక రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఎంటనేది చాలా సున్నితంగా తెరమీద చూపించాం. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు మా Tempt రాజా అని నిర్మాత రాంకీ అన్నారు.

Tempt Raja adult comedy movie teaser goes viral

నటీనటులు: రాంకీ (వీర్నాల రామకృష్ణ), దివ్య రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్), ఆస్మ, పోసాని కృష్ణ మురళి, యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కృష్ణ, నాయుడు) గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి.
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: రాంకీ (రామకృష్ణ)
నిర్మాత: సే క్రియేషన్స్
సమర్పణ: ఏఆర్కే ఆర్ట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.గురువరవ్
డివోపి: రాజు
ఎడిటర్: బిఎన్ఆర్.
మ్యూజిక్: హరి గౌర
రీ రికార్డింగ్: తమిరి శంకర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, హరి గౌర, కసర్ల శ్యామ్
డైలాగ్స్: రాంకీ, జి రవి, విజయ్
మేనేజర్: జి రవి
బ్యానర్: సే క్రియేషన్స్
పిఆరోఓ: మధు.విఆర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X