Don't Miss!
- News కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ ఫన్ టీజర్... నవ్వులే నవ్వులు!
సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్. హన్సిక హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా ఫన్ టీజర్ విడుదల చేశారు. ఇందులో సందీప్ కిషన్, హన్సిక లాయర్ పాత్రల్లో కనిపించబోతున్నారు. కేసులు లేని లాయర్ పాత్రలో సందీప్ ప్రేక్షకులను నవ్వించబోతున్నారు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయని స్పష్టమవుతోంది.
టీజర్ రిలీజ్ కార్యక్రమంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ... ఇది కొత్త కాన్సెప్టు ఏమీ కాదు... ఇది పక్కా కమర్షియల్, ఎమోషనల్ ఎంటర్టెనర్. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. సరదాగా ఫ్యామిలీతో వెళ్లి బాగా నవ్వుకోవచ్చు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ నాగేశ్వర్ రెడ్డి. ఆయనతో సినిమా చేసే క్రమంలో చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.
ఈ చిత్రంలో సందీప్ కిషన్, హన్సిక, మురళీశర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్, బ్రహ్మానందం, వెన్నెలకిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘుబాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి, నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీశ్, బ్యానర్: శ్రీ నీలకంఠేశ్వరస్వామి క్రియేషన్స్, సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, కథ: టి.రాజసింహ, మ్యూజిక్: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, స్క్రీన్‌ప్లే: రాజు, గోపాల కృష్ణ, ఆర్ట్: కిరణ్, యాక్షన్: వెంకట్.