AP Elections ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి.. తిరగబడ్డ జనసైనికులు.. ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్‌లో స్వల్ప ఘర్షణలు, ఉద్రిక్తతల మధ్య ఓటింగ్ కొనసాగుతున్నది. పలు చోట్ల అధికార పార్టీ, టీడీపీ కూటమి నేతలకు, కార్యకర్తల మధ్య దాడులు జరిగిన సంఘటనలు నమోదు అయ్యాయి. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకొన్నది. ప్రస్తుతం ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ అబ్యర్థి శివకుమార్‌పై ఓటరు చేయి చేసుకోవడం వైరల్‌గా మారింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
తెనాలిలోని ఓ పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు భారీగా ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేసేందుకు వచ్చాడు. అయితే ఓటర్ మాత్రం క్యూలైన్‌లో నిలబడమని ఆయనకు సూచించారు. అయితే తననే లైన్‌లో రమ్మంటావా అంటూ ఓటరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చెంపపై బలంగా కొట్టాడు.

అయితే ఊహించని పరిణామంతో జనసేన సానుభూతిపరుడైన ఓటరు కంగు తిన్నాడు. కానీ వెంటనే తేరుకొని ఎమ్మెల్యే గూబ గయ్‌మనిపించాడు. దాంతో బిత్తరపోయి ఓటర్‌పై ఎమ్మెల్యే, అతడి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే స్థానికులు జోక్యం చేసుకొని ఓటరుకు అండగా నిలబడటంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది.

అయితే తెనాలి వైసీపీ అభ్యర్థిపై క్యూలైన్‌లో నిలబడిన ఓటర్లు, జనసేన ఫాలోవర్స్ తిరగబడటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ ఎమ్మెల్యే తన హోదాను పట్టించుకోకుండా పరువు పోగొట్టుకొన్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











