విడాకులు తీసుకోబోతున్న బుల్లితెర క్రేజీ కపుల్.. సిగ్గులేకుండా చెప్పేస్తున్నానంటూ నటి షాక్.. అసలేమైందంటే?
ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోహీరోయిన్ల నుంచి సామాన్య ప్రజల అందరి వరకు కాస్త నచ్చకపోయినా విడాకులు తీసుకుంటున్నారు. ఎంతగానో ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుని, కాపురాలు చేశాక కూడా దూరం అవుతున్నారు. మరికొందరు అయితే ఇద్దరు, ముగ్గురేసి పిల్లలు పుట్టాక కూడా విడిపోతూ ఉంటారు. అయితే తాజాగా అదే కోవలోకి చేరబోతున్నారు తెలుగు బుల్లితెర క్రేజీ కపుల్. అయితే వాళ్లెవరు, ఎందుకు అలా చేస్తున్నారు, వారిద్దరి మధ్య ఉన్న సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రియతమ్ చరణ్.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి మెప్పించిన ఇతడు... సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి మానస గుట్టను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరికీ ఇప్పడికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో అనేక గొడవలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉండట్లేదు. విడివిడిగా ఉంటూనే జీవితాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా మానస ఓ యూట్యూబ్ వ్లాగర్ కావడంతో ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు త్వరగా వెలుగులోకి రావడం వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే గత నాలుగు నెలలుగా ఆమె చేస్తున్న యూట్యూబ్ వ్లాగ్స్ లో ఆమె భర్త ప్రియతమ్ చరణ్ కనిపించట్లేదు. ఆమె కూడా వేరే ఇంట్లో ఉండడంతో అందరినీ అనుమానం వచ్చింది. ఇక అప్పటి నుంచి అందరూ ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు. మీ భర్తతో మీరు విడాకులు తీసుకుంటున్నారా అంటూ అడుగుతూనే ఉన్నారు. దీంతో చాలా చిరాకు వచ్చిన ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. తమ మధ్య గొడవలు వచ్చిన విషయం వాస్తవమే అని... గత నాలుగు నెలలుగా తాను ఎంతో టార్చర్ అనుభవిస్తున్నట్లు తెలిపింది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత కష్టం వచ్చినా బయటకు కనిపించకుండా తన పని తాను చేసుకుంటున్నానని తెలిపింది.

కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా పదే పదే ప్రశ్నలు అడుగుతున్నారని ఆసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తాను తన భర్తకు దూరంగా ఉండి పిల్లల్ని చూసుకుంటున్నానని... మీరిలా పదే పదే ప్రశ్నలు అడుగుతుంటే తాను పని మీద మనస్సు పెట్టలేకే అనేక ఇబ్బందులు పడుతున్నానని కూడా పేర్కొంది. ఇప్పడు తనకు ఉన్న ఒకే ఒక ఇన్ కమ్ సోర్స్ ఈ యూట్యూబ్ ఛానెల్ అని తన పని తనను చేసుకోనివ్వండి అంటూ వేడుకుంది. సిగ్గులేకుండా చెప్పేస్తున్నా.. నాకున్నది ఈ ఒక్క ఛానెల్ యే నా పిల్లల్ని నేను కాపాడుకోవాలనుకుంటున్నానను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
అలాగే భర్త ప్రియతమ్ కు, తనకు మధ్య మూడో వ్యక్తి రావడం వల్ల అనేక సమస్యలు వచ్చాయని... నాలుగు నెలలుగా తామిద్దరూ దూరంగా ఉంటున్నట్లు మానస పేర్కొన్నారు. అయితే తామిద్దరూ చాలా బాధ పడుతున్నామని కానీ విడాకులు మాత్రం అస్సలే తీసుకోమని చెప్పింది. ప్రస్తుతం తాము క్లిష్ట పరిస్థితులు ఎదుర్కుంటున్నామని... ఇక దీని గురించి అడిగి ఇబ్బంది పెట్టకుండా... తాను చేసే వ్లాగ్స్ గురించి మాత్రమే మాట్లాడాలని సూచించింది. మరి ఇంకెంత కాలం ఈ క్రేజీ కపుల్ దూరంగా ఉంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











