పిఠాపురం ఓటు విలువ 1.6 లక్షల రూపాయలు.. ఓటు కోసం డబ్బుకు వెనుకాడని ఎన్నారై యువకుడు
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఉత్సాహం ఓటు వేసేందుకు దేశంలోని తెలుగు వాళ్లే కాకుండా ప్రవాసాంధ్రలు తరలివచ్చారు. ఎన్నికల తేదీ ప్రకటించగానే విదేశాల్లో ఉన్న తెలుగు వారు తమ ప్రాంతంలో ఓటు వేయాలని నిర్ణయించుకొన్నారు. అయితే పిఠాపురంలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రవాసాంధ్రులు విషయాలు వింటే మరింత ఆసక్తి కలుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..
2024 సంవత్సరంలో ఎన్నికలు తెలుగు ప్రజలు, ఓటర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, ఫాలోవర్స్ తమ నేతలను గెలిపించుకొనేందుకు ఉత్సాహం చూపించారు. దాంతో విదేశాల నుంచి భారీగా ఓటు వినియోగించుకొనేందుకు తరలి వచ్చారు.

ఆంధ్రాలో ఈ సారి ఎన్నికలపై ఓటర్లు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రులు తమ సొంత ఊర్లలో ఓటు వినియోగించుకొనేందుకు సిద్దమయ్యారు. దాంతో ఒకట్రెండు రోజుల ముందే భారీగా ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఇక అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలుగు వాళ్లు తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు ఎంతైనా డబ్బు వెచ్చించడానికి వెనుకాడలేదు. విమాన ఛార్జీలు ఎక్కువైనా టికెట్స్ కొని తమ సొంత ఊర్లకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
అయితే అమెరికాలో ఉండే పిఠాపురానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాత్రం పెద్ద మొత్తం పెట్టి టికెట్ కొని తన గ్రామానికి చేరుకొన్నారు. టెక్సాస్‌లో పనిచేసే బీ ప్రసన్న కుమార్ అనే యువకుడు పిఠాపురంలో ఓటు వేసేందుకు సుమారుగా 1.6 లక్షలు ఖర్చు చేశానని చెప్పారు. ఏది ఏమైనా పిఠాపురంలోనే ఓటు వేయాలని నిర్ణయించుకొన్నానని చెప్పాడు.
అయితే పిఠాపురంలో జనసేన తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో ప్రత్యేకమైన దృష్టి నెలకొన్నది. ప్రతిష్టాత్మకంగా మారిన నియోజకవర్గంలో ఓటు వేయాలని టెక్సాస్ నుంచి వచ్చాను అని మీడియాకు వెల్లడించినట్టు ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











