సినిమా వాళ్లకు గుడ్ న్యూస్… ఎదురు చూపులకు బ్రేక్..కానీ షరతులు వర్తిస్తాయి!
తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు గుడ్ న్యూస్. కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో చాలా రోజులుగా ఎదురు చూపులకు బ్రేక్ పడింది. రెండోదశ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ లకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈరోజు ఉదయం జరిగిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ మీటింగ్ లో కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
కరోనా కారణంగా గత ఏప్రిల్ నుంచి షూటింగ్స్ ఆగిపోయిన నేపథ్యంలో షూటింగ్ చేస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ముందుగా ఆ సినిమా షూటింగ్స్ లో పాల్గొని షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్ ఆగిపోయిన సినిమాలకి ముందుగా పనిచేసి ఆ తర్వాత మాత్రమే కొత్త సినిమాలకు ప్రాముఖ్యత ఇచ్చేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. దర్శకులు కూడా కరోనా కారణంగా ఆగిపోయిన కొన్ని సినిమాల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాల్సిందిగా కోరాలని ఈ జాయింట్ మీటింగ్ నిర్ణయం తీసుకున్నారు.

అంతేగాక షూటింగ్ చేసే ప్రొడక్షన్ సంస్థ ఆర్టిస్ట్స్ మొదలు టెక్నీషియన్స్ వరకు వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ముందుగానే డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే షూటింగ్ కి హాజరయ్యే ప్రతి టెక్నీషియన్ మొదలు ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని అలా అన్ని జాగ్రత్తలు తీసుకున్న సభ్యులు మాత్రమే షూటింగ్ హాజరయ్యే విధంగా నిర్మాణ సంస్థలకు సూచనలు చేయాలని ఈ రోజు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలు విధిగా పాటిస్తూ షూటింగ్ జరుపాలని నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











