ఊహించని విధంగా రాజా సాబ్ మూవీ.. మెయిన్ హైలైట్ లీక్ చేసిన ప్రొడ్యూసర్
ఇప్పుడంటే టాలీవుడ్‌లో చాలా మందే పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. కానీ, అందరి కంటే ముందే ఈ స్థాయిని అందుకున్న హీరో మాత్రం రెబెల్ స్టార్ ప్రభాసే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 'బాహుబలి' సిరీస్‌తో దేశ వ్యాప్తంగా మార్కెట్, ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అతడు.. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో భారీ సినిమాల్లోనే నటిస్తూ వెళ్తున్నాడు.
కొంత కాలంగా రెబెల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీలు చేస్తున్నాడు. కానీ, విజయాలు మాత్రం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో 'సలార్: సీజ్‌ఫైర్' హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ ఊపులోనే ఇప్పటికే పట్టాలెక్కించిన పలు ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించే 'ది రాజా సాబ్' మూవీ ఒకటి.

రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో హర్రర్ కామెడీతో రూపొందుతోన్న 'ది రాజా సాబ్' సినిమాను సీక్రెట్‌గానే మొదలు పెట్టి చాలా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 40 శాతం వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్లను రెడీ చేసుకుంటోంది.
ప్రభాస్ నటిస్తోన్న 'ది రాజా సాబ్' సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన హైలైట్లను రివీల్ చేశారు. 'ది రాజా సాబ్ మూవీలో వీఎఫ్ఎక్స్ వర్క్ హైలైట్‌గా ఉంటుంది. ఎవరూ ఊహించని సన్నివేశాలు ఇందులో ఉంటాయి' అని చెప్పారు.
నిర్మాత విశ్వ ప్రసాద్ కంటిన్యూ చేస్తూ.. 'ది రాజా సాబ్ మూవీ తెరపైన విజువల్ వండర్‌గా ఉండబోతుంది. సినిమాలో వీఎఫ్ఎక్స్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కల్కి ఏడీ మూవీ విడుదల ఉంది కాబట్టి.. మా సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. అది విడుదలైన తర్వాత మా మూవీ నుంచి కంటెంట్‌ను వదులుతుంటాము' అని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. 'ది రాజా సాబ్' చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











