Thala Trailer Review: తల ట్రైలర్ రివ్యూ.. అమ్మ రాజశేఖర్ ఫినిష్ అనే వాళ్లకు జవాబు చెబుతాడా?

ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్, నటుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన చిత్రం తల. ఎస్తేర్ నోరోన్హా, అంకిత నాన్సర్ ప్రధాన పాత్రల్లో నటించారు. పీ శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రాధ రాజశేఖర్ వ్యవవహరించిన ఈ చిత్రంలో రోహిత్, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గాండ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. తెలుగు యువ హీరోలు సోహైల్, అశ్విన్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

అమ్మ అంటే ఓ యువకుడికి పిచ్చి. తన తల్లి కోసం ఎంతకైనా తెగించే యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రూపొందించారు. తనన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కొడుకు కోసం తల్లి ఏం చేసిందనే ప్రధానమైన పాయింట్‌తో తల సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ మంచి ఎమోషన్స్‌తోపాటు యాక్షన్ సన్నివేశాలతో గ్రిప్పింగ్‌గా కనిపించింది.

Thala Trailer Review Amma Rajashekar s actions drama looks high Emotions with Amma Ragin Raj

ప్రతీ వ్యక్తికి తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న అంటే అందరికి ఇష్టం. కానీ నాకు అలాంటి వారు ఎవరూ లేరు. కానీ నాకు అమ్మ ఉంది. అమ్మ అంటే నాకు పిచ్చి అంటూ రాగిన్ రాజ్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అమ్మాయిల కోసం చనిపోయే కుర్రాళ్లను చూశాం. అమ్మ కోసం చనిపోయే కుర్రాడిని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం అంటూ చెప్పే డైలాగ్ భావోద్వేగాన్ని రగిలించేలా ఉంది.

ఇక తల్లి ఆవేదనను కూడా తల సినిమా టీజర్‌లో జొప్పించారు. వాడిని ఏడుపును ఆపించడానికి ఊరి మొత్తాన్ని ఏడిపించాను. కానీ నా కొడుకును ఏడిపించిన వీడిని ఏం చేయాలి? అనే విధంగా తల్లి చెప్పిన డైలాగ్స్ చూస్తే.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్‌తోపాటు మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిందనే విషయం స్పష్టమైంది. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు హైరేంజ్‌లో కనిపించాయి. ఈ చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా మంచి ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ కసిగా రూపొందించారనే విషయం అర్ధమైంది.

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అంతా అమ్మ రాజశేఖర్ ఫినిష్ అన్నారు. ఇప్పుడు తలతో వచ్చా.. చెయ్యితో, కాలితో అన్నిటితో వస్తా. అమ్మకు ఒంట్లో బాగోలేకపోవడు వల్ల కాస్త గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం నేను ఫ్రీ. నా కొడుకుతో సినిమా చేయాలనేది చాలా రోజుల నుంచి నా కోరిక. ఓ సందర్భంలో మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని చెప్పాను. అదెప్పుడనేది అందరికీ తెలుసు. అప్పటి నుంచి నిద్ర లేదు అని ఎమోషనల్ అయ్యారు.

నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి, చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్ తదితరులు
దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీవోపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్స్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి

More from Filmibeat

Read more about: thala amma rajashekar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X